ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీలోని నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసును క్వాష్ చేయాలని కోరారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా, అనుమతి లేకుండా జన సమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. మే 11న అల్లు అర్జున్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే కూడా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలో సెక్షన్ 30, 144 అమల్లో ఉన్నప్పటికీ వేల మందితో ర్యాలీ నిర్వహించడం దుమారమే లేపింది. ఆ రోజు నంద్యాలలో ఎన్నికల కోడ్‌ను అమలు చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి.
దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా, కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులపై కొరఢా ఝుళిపించింది. నంద్యాలలో ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి, డీఎస్పీ ఎన్.రవీంద్ర నాథ్ రెడ్డి, సీఐ రాజా రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశాలిచ్చింది. వారిపై 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ చేయాలని సూచించింది.
ఎలాంటి అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి వెళ్లడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 144, పోలీస్ 30 యాక్టు అమల్లో ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా పర్యటించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు నటుడు అల్లు అర్జున్ సహా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిపై నంద్యాల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్