* కోనసీమ అల్లర్లలో వాలంటీర్ హత్య
యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి, వైసిపి నేత పినిపె విశ్వరూప్ తనయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో మంత్రి తనయుడిని నిందితుడిగా గుర్తించి తమిళనాడులోని మధురై సమీపంలో అరెస్ట్ చేశారు. 2022లో జరిగిన వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు అక్కడి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై ఏపీకి తరలిస్తున్నారు. కోనసీమ ప్రాంతానికి అంబేడ్కర్ పెట్టిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. అదే సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్ 2022 జూన్ 6న హత్యకు గురయ్యాడు.
ఈ కేసులో సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన వడ్డి ధర్మేశ్‌ను పోలీసులు విచారించారు. హత్య కేసులో అక్టోబర్ 18న ధర్మేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులతో పాటు మాజీ మంత్రి పినిపె శ్రీకాంత్ కూడా ఉన్నట్టు గుర్తించారు.
ఈ క్రమంలోనే మదురైలో తమిళనాడులో శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్సతోంది. ఈ నెల 18న ధర్మేశ్‌ను విచారించి హత్య వివరాలు సేకరించారు.
మృతుడు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌తో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవాడు. దుర్గాప్రసాద్‌ను హత్య చేయించాలని భావించిన శ్రీకాంత్.. ధర్మేశ్ సహాయం కోరి, మరో నలుగురికి ఆ బాధ్యత అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు.
కోనసీమ ప్రాంతంలో ఉన్న ప్రముఖ లాడ్జిలో హత్యకు ప్లాన్ చేశారు. మృతుడు దుర్గాప్రసాద్‌ను ధర్మేశ్ కోటిపల్లి రేవు వద్దకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. వారిని మిగిలిన వారు కారులో అనుసరించారు. కోటిపల్లి నుంచి పడవలోకి వెళ్లిన తర్వాత కారులో అనుసరించి వచ్చిన వారిలో ముగ్గురు దుర్గాప్రసాద్ మెడకు తాడు బిగించి హత్య చేసినట్టు అతని స్నేహితుడు ధర్మేశ్ పోలీసులకు వివరించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మృతుడి భార్య మంత్రి వాసంసెట్టి సుభాష్‌ను ఆశ్రయించారు. మంత్రి సాయంతో డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ 30న ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో కదలిక వచ్చింది.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్