2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రతి త్రైమాసికానికి సమర్పించిన ఈ ప్రతిపాదనలు విద్యుత్ చట్టం-2003, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి అదనపు విద్యుత్ కొనుగోలు ఖర్చులపై ఆధారపడి ఉన్నాయని డిస్కమ్‌లు స్పష్టం చేశాయి. ఏపీఈఆర్‌సీ ఈ సర్దుబాటులను సమీక్షించి, ఆమోదిస్తుంది. ఆ తరువాత వినియోగదారులపై భారం వేస్తుంది. మొత్తం రాష్ట్రంలో సగటు సర్దుబాటు యూనిట్‌కు అదనంగా రూ. 1.27గా అంచనా వేసింది.
చారిత్రాత్మకంగా 2013-14 ఆర్థిక సంవత్సరం వరకు త్రైమాసిక ప్రాతిపదికన ఇంధన సర్‌ఛార్జ్ సర్దుబాటు (ఎఫ్ఎస్ఎ) విధించబడింది. ఆ తరువాత ఎఫ్ఎస్ఎ నిబంధనలు రద్దు చేసి,. ఖర్చులు తదుపరి సంవత్సరం వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్ఆర్)లో చేర్చారు.
2020-21 ఆర్థిక సంవత్సరంలో, అప్పిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (ఏపీటీఈఎల్) నుండి వచ్చిన ఆర్డర్‌ను అనుసరించి ఎఫ్‌పీపీసీఏ నిబంధనలు మళ్లీ ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 2021 నుండి ఎఫ్‌పీపీసీఏ త్రైమాసికానికి ఛార్జీ విధిస్తున్నారు. 2023 మార్చి నుండి యూనిట్‌కు రూ. 0.40 ఆటోమేటిక్ నెలవారీ చేరుతుంది.
కరోనా లాక్‌డౌన్ సమయంలో తగ్గిన విద్యుత్ డిమాండ్ కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో డిస్కమ్‌లు ‘ట్రూ-డౌన్’ను కూడా ఏర్పడింది. తరువాతి సంవత్సరాల్లో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గణనీయమైన ‘ట్రూ-అప్‌లు’ వచ్చాయి. దీనివల్ల గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీసింది.
ఎఫ్‌పీపీసీఏ ఛార్జీల ఆమోదం లేకుండా, డిస్కమ్‌లు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 75 శాతం నష్టాలను భరించవలసి వస్తుంది. డిస్కామ్ లు అన్ని వర్గాల వినియోదారుల నుండి ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేయాలని కోరుతున్నాయి.
More Stories
స్వస్థత పేరుతో చర్చిలో ప్రార్థనలతో ఓ బాలిక బలి
ఏపీ మంత్రివర్గంలోకి నాగబాబు
పవన్ కల్యాణ్ ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్