వాయనాడ్‌లో ప్రియాంకపై బిజెపి అభ్యర్థిగా ఖుష్బూ!

వాయనాడ్‌లో ప్రియాంకపై బిజెపి అభ్యర్థిగా ఖుష్బూ!
 
కేరళలోని వాయనాడ్  లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పై నటి ఖుష్పూ ను పోటీకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్‌తోపాటు, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీచేసి రెండ చోట్ల విజయం సాధించారు. దాంతో వాయనాడ్‌ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

దాంతో వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‌ పార్టీ వాయనాడ్‌ నుంచి ప్రియాంకాగాంధీని బరిలో దించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రియాంకాగాంధీపై నటి కుష్బూ సుందర్‌ను బరిలో దించాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కుష్బూ సుందర్‌ స్పందిస్తూ . ఎన్నికల వేళ ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయని,  ఇది కూడా పుకారే అని చెప్పారు. అయితే ఒకవేళ పార్టీ ఆదేశిస్తే తాను ప్రియాంకాగాంధీపై పోటీ చేయడానికి సిద్ధమేనని ఆమె స్పష్టం చేశారు.

కాగా వాయనాడ్‌ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగనుంది. ఎందుకంటే అక్కడి నుంచి కమ్యూనిస్టు పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలో దించింది. తమ అభ్యర్థి సత్యన్‌ మొఖేరీ బరిలో దిగుతారని ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. కాగా వాయనాడ్‌ లోక్‌సభ స్థానానికి నవంబర్‌ 13న ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్‌ 23న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్లతోపాటే ఓట్లను లెక్కించి ఫలితాన్ని వెల్లడించనున్నారు.