సికింద్రాబాద్ మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. రాత్రి ఆలయంలో శబ్దం రావడంతో మేల్కొన్న స్థానికులు ముగ్గురిలో ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
కేసు నమోదుచేసిన పోలీసులు పరారైన వారి కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ, హిందూ సంఘాల కార్యకర్తలు ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. గుడిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని ధర్నాకు దిగారు. ధర్నాలో పాల్గొన్న బిజెపి నేత మాధవి లతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఆలయంపై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు సికింద్రాబాద్ సినీ పోలీస్ హోటల్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్ 3, 4 ఫ్లోర్‌లలో 50 గదులను పలువురు అగంతకులు అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
మెట్రో పోలీస్ హోటల్‌లో నివాసం ఉండే సలీం సల్మాన్ ఠాకూర్ అనే వ్యక్తి ముత్యాలమ్మ గుడిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. హోటల్ నుంచి మాజిద్ వైపు వెళ్తుండగా విగ్రహం ధ్వంసానికి పాల్పడ్డారని వెల్లడించారు. ఆలయంపై దాడి అనంతరం వారంతా పారిపోయినట్లు పేర్కొన్నారు. రిసెప్షన్‌లో రికార్డ్స్, సీసీటీవీ ఫుటేజ్, దుండగుల ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల వివరాలు సేకరించి వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర కిషన్ రెడ్డి ఆలయాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మత విద్వేషాలను ప్రేరిపించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నిన్నటివరకు ఎంతో భక్తి శ్రద్ధలతో దుర్గామత నవరాత్రులు, బతుకమ్మ వేడుకులు జరుపుకున్నారని చెప్పారు. వి
గ్రహం ధ్యంసం చేయడం ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమేనని చెప్పారు. దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు. మత కలహాలు జరుగకుండా అడ్డుకోవాలని కేంద్ర కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి గేట్లు విరగొట్టారని చెప్పారు. వారు దొంగతనం చేయడం కోసం రాలేదని, కేవలం మత ఉద్రిక్తలు రెచ్చగొట్టేందుకే వచ్చారని ఆరోపించారు. హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నారని తెలిపారు.
ఆలయాలపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయాలకు పటిష్ట భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు ఘటనను తీవ్రంగా ఖండించారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంపై దాడి తీవ్రకలకలం రేపుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కె టి రామారావు తెలిపారు. ఇలాంటి తెలివితక్కువ చర్యలు హైదరాబాద్ నగర సహనశీలతకు మచ్చను తీసుకువస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
చైనా జలవిద్యుత్ డ్యామ్ లతో 12 లక్షల మంది టిబెటన్ల నిరాశ్రయం