
ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్ సింహ్‌జీ, దసరా పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా శత్రుసల్యసింహ్జీ మాట్లాడుతూ, “పాండవులు తమ 14 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా ముగించిన దసరా పర్వదినం ఎంతో ముఖ్యమైనది. అలాగే, ఈ ప్రత్యేక రోజున అజయ్ జడేజా నా వారసుడిగా, నవానగర్ (జామ్ నగర్ పాత పేరు) తర్వాతి జంసాహెబ్‌గా ఉండటానికి అంగీకరించడంతో, ఈ విజయం నాకు కూడా ఎంతో మహత్తరమైనది. ఇది జామ్ నగర్ ప్రజలకు ఒక గొప్ప వరంగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను” అని తెలిపారు.
ప్రస్తుతం నవానగర్ జామ్‌సాహెబ్ వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో తన రాజసింహాసనాన్ని తన వారసుడైన అజయ్ జడేజాకు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆ రాజవంశం సంప్రదాయం ప్రకారం రాజు పదవులు వారసులకు సంక్రమిస్తున్నప్పటికీ పరిపాలన మాత్రం వాళ్ల చేతిలో లేదు. జామ్ నగర్ రాజ కుటుంబానికి క్రికెట్ రంగంతో ప్రత్యేక అనుబంధం ఉంది.
ఈ రాజ కుటుంబానికి చెందిన కేఎస్ రంజిత్ సింహ్‌జీ, కేఎస్ దులీప్ సింహ్‌జీ పేర్లతోనే భారత దేశంలో అత్యంత ప్రముఖమైన రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలు ఏర్పాటయ్యాయి. అజయ్ జడేజాకు కూడా ఈ రాయల్ ఫ్యామిలీతో సన్నిహిత అనుబంధం ఉంది. అజయ్ జడేజా ముత్తాత 1933లో ఇంగ్లండ్ జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాడు. అజయ్ జడేజా భారత క్రికెట్ జట్టుకు 1992 నుంచి 2000 వరకు ప్రాతినిధ్యం వహించాడు.
ఈ కాలంలో 196 వన్డేలు, 15 టెస్టుల్లో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి బ్యాటింగ్ నైపుణ్యంతోపాటు అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన చేసేవాడు. అయితే 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కోవడంతో కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. బీసీసీఐ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. నిషేధం ముగిసిన తర్వాత కూడా అతడిని తిరిగి భారత జట్టుకు ఎంపిక చేయలేదు.
జడేజా ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా కొనసాగుతున్నారు. ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ జట్టుకు మెంటార్‌గా పనిచేస్తున్న జడేజా, రాయల్ ఫ్యామిలీలో కీలక స్థానాన్ని ఆక్రమించడం అతని జీవితంలో మరో గౌరవప్రదమైన ఘట్టంగా నిలుస్తోంది.
శత్రుసల్యసింహ్జీ అజయ్ తండ్రి దౌలత్‌సిన్హ్జీ జడేజాకి వరుసకు సోదరుడు. ఆయన 1966-67లో రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధిపతిగా కూడా శత్రుసల్యసింహ్జీ అజయ్ తండ్రి దౌలత్‌సిన్హ్జీ జడేజాకి వరుసకు సోదరుడు. ఆయన 1966-67లో రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధిపతిగా కూడా పనిచేశారు. శత్రుసల్యసింహ్జీను తన తండ్రి మరణానంతరం ఫిబ్రవరి 3, 1966న నవనగర్‌కు అధిపతిగా నియమించారు.
జడేజా తండ్రి దౌలత్‌సిన్హ్జీ జడేజా 1971 నుండి 1984 వరకు జామ్‌నగర్ నుండి మూడుసార్లు పార్లమెంటు సభ్యుడు. 1992 నుండి 2000 మధ్య భారతదేశం తరపున 196 ఓడి1లు, 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన 53 ఏళ్ల క్రికెటర్ అజయ్ జడేజా, జామ్‌నగర్ రాజ కుటుంబానికి చెందిన వారసుడు.
అజయ్ జడేజా ఖేల్ (2003), పల్ పల్ దిల్ కే స్సాత్ (2009) వంటి బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు. డ్యాన్స్ రియాలిటీ షో, ఝలక్ దిఖ్లా జాలో పాల్గొన్నారు. అతను క్రికెట్ వ్యాఖ్యాతగా చురుకుగా ఉన్నారు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 సమయంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమ్ మెంటార్‌గా ఉన్నారు.
More Stories
అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
12-13 తేదీల్లో మోదీ అమెరికా పర్యటన