మూసీ సుందరీకరణకు బీజం వేసిందే బీఆర్ఎస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అప్పట్లో మూసీ సుందరీకరణకు బీజం వేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆ పార్టీకి గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆరోపించారు.
నిరుపేదలు నివాసం ఉంటున్న బస్తీలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. ఇలా కూల్చివేతలతో సర్కార్ మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటుందా అని ప్రశ్నించారు. పేదల ఇళ్ల కూల్చివేతల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
అధికారంలో ఉన్న ప్రభుత్వం అందరికీ మంచి చేయాలని, ఇలా ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదని హితవు పలికారు. పేదల ఇళ్ల కూల్చివేతలకు తమ పార్టీ విరుద్ధమని పేర్కొంటూ మూసీ ప్రాజె క్ట్ బాధితుల ఇళ్లను కూల్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అంబర్ పేట నియోజకవర్గంలోని గోల్నాక తులసి రామ్ నగర్ (లంక ) బస్తి, అంబేద్కర్ నగర్ తదితర మూ సీ పరివాహక ప్రాంతంలో సొంతింటిని కో ల్పోతున్న బాధ్యతలను ఆయన పరామర్శించారు.
వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కాదని, ప్రజలు తమ కష్టార్జితంతో ఒకొక్క ఇటుక పేర్చుకుని ఇల్లు కట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఇల్లు కావని ఎద్దేవా చేశారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ మూసీ సుందరి కన్నా పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్‌ను చైర్మన్ చేసి అప్పుడు కూడా ఇదే తరహాలో ఇళ్లకు మార్కింగ్ చేశారని గుర్తు చేశారు.
గత 10 సంవత్సరాలలో బి ఆర్‌ఎస్ వారు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని నాన్చివేత ధోరణితో మభ్య పెట్టారని, ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చింది లేదని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పేదవాడి సమాధులపై మొక్కలు పెట్టి సుందరీకరణ చేయాలనుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకు రూ. 1.5 లక్షల ఖర్చు పెడతామంటుందని, నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అందులో రూ.50 వేల కోట్లతో ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆయన హితవు చెప్పారు.
కాగా, అక్కినేని కుటుంబం, హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళగా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని తెలిపారు. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడటం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అలవాటైపోయిందని ఆయన మండిపడ్డారు.
ఇలాంటి సంస్కృతిని కేసీఆర్, కేటీఆర్ మొదలు పెడితే రేవంత్ అండ్ కో కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఇలాంటి నాయకులను బహిష్కరించాలని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు