జార్ఖండ్ సాహిబ్‌గంజ్‌లో గుర్తు తెలియని దుండగులు రైల్వేటాక్‌ను పేల్చివేశారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతున్నది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. పేలుడులో కుట్రకోణంపై ఆరా తీస్తున్నారు.
సాహిబ్‌గంజ్ జిల్లా బర్హెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రంగ ఘుట్టు గ్రామ సమీపంలోని లాల్మాటియా నుంచి ఫర్కా వెళ్లే ఎంజీఆర్ రైల్వేలైన్‌పై గుర్తు తెలియని దుండగులు బుధవారం పేలుడు పపేలుడు దార్థాలను అమర్చి పేల్చివేశారు. ఈ ఘటనకు కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. పేలుడు కారణంగా పట్టాలు 39 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. రంగ గుట్టు గ్రామ సమీపంలోని పోల్ నంబర్ 40/1 సమీపంలో జరిగింది.
ఎంజీఆర్ రైల్వేలైన్ చుట్టపక్కల గ్రామాల వరకు పేలుడు శబ్దం వినిపించింది. పేలుడు జరిగిన ట్రాక్ మార్గంలో 42/02 పోల్‌నంబర్ వద్ద బొగ్గుతో ఉన్న గూడ్స్ రైలు నిలిచి ఉన్నది. సమాచారం అందుకున్న ఎస్పీ అమిత్ కుమార్ సింగ్, బదర్వా డీఎస్పీ మంగళ్ సింగ్ జముదా, ఎన్టీపీసీ అసిస్టెంట్ ఇంజినీర్ షర్బత్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో పేలుడుకు ఉపయోగించిన వైర్లను పోలీసులు గుర్తించారు. అసోంలోని నిషేధిత ఉగ్రవాద సంస్థ నేషనల్ సంతాల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చురుగ్గా ఉన్నట్లు సమాచారం. ఇది వారిపనేనా కావొచ్చనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు.
పేలుడుకు ఏం వినియోగించారో తెలుసుకునేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్ రప్పించారు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఇటీవల రైలు ట్రాక్‌లపై ఇనుప స్తంభాలు, సిలిండర్లను పెట్టి రైలుకు ముప్పు కలిగించేందుకు కుట్ర చేసిన విషయం తెలిసిందే. తాజాగా ట్రాక్ పేల్చివేయడం ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
More Stories
అనంత్‌నాగ్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
గ్లోబల్ వార్మింగ్‌తో జనజీవనానికి మరింత ముప్పు
టైగర్ రిజర్వ్‌లో మూడు రోజుల్లో 10 ఏనుగుల మృతి