ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయలేక పిల్లిగంతులు వేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని ఆయన తెలిపారు. రుణమాఫీ కాలేదని మేడ్చల్‌లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు.
రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున బీజేపీ దీక్ష చేపట్టబోతుందని తెలిపారు. రుణమాఫీ కాని రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ దీక్ష కొనసాగుతోందని వివరించారు.
ఈ ఇందిరా పార్కు వద్ద జరిగి రైతు దీక్షలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. ఘట్ కేసరిలో 1206 మంది రైతులు రుణం తీసుకుంటే ఇంకా 1006 మందికి రుణమాఫీ కాలేదని గుర్తు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎంఓ నుంచి టూ. 17వేల కోట్ల రుణమాఫీ చేశామని ప్రకటన వచ్చిందని.. దాని లెక్కలు లేవని ఈటల విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు రైతుబంధు, రైతు బీమా, రైతు బోనస్ వస్తాయనే నమ్మకం లేకుండాపోయిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అరాచక ప్రభుత్వంతో రైతులకు అన్యాయం జరుగుతోందని, రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నామని తెలిపారు.
నాడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శాసనసభ ఎన్నికల్లో 418 హామీలను ఇచ్చారని, ఆయా హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అందులో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని, రకరకాలుగా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీని తీసుకువచ్చి అమాయకమైన రైతులకు మాయమాటలు చెప్పారని దుయ్యబట్టారు. రైతన్నలకు రుణమాఫీ చేస్తానని, పంటకు గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పి, దానిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆయన మండిపడ్డారు.
More Stories
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్
బంజారా మ్యూజియం ప్రారంభించిన ప్రధానికి కృతజ్ఞతలు
హైదరాబాద్ నుండి నేరుగా గోవాకు రైలు ప్రారంభం