2024 మార్చి ముగింపు నాటికి క్రెడిట్ కార్డు బకాయిలు ఏకంగా రూ.2.6 లక్షల కోట్లకు ఎగిశాయి. ఇంతక్రితం ఏడాది మార్చి నాటికి ఈ విలువ రూ.2 లక్షల కోట్లుగా నమోదయ్యింది. కరోనాకు ముందు 2019 మార్చి నాటికి బకాయిలు రూ.87,686 కోట్లుగా ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో ప్రతీ ఏడాది సగటున 24 శాతం చొప్పున పెరుగుతూ రావడం ఆందోళన కలిగిస్తున్నది.
”యువ మిలీనియల్స్ క్రెడిట్ కార్డు మొత్తం పరిమితిని ఉపయోగిస్తున్నారు. అనంతరం నేరుగా డిఫాల్ట్ చేస్తున్నారు. రుణాన్ని కూడా తిప్పికొట్టకుండా డిపాల్టర్లుగా మారుతున్నారు.” మాక్వారీ పరిశోధన విశ్లేషకుడు సురేష్ గణపతి పేర్కొన్నారు. క్రెడిట్ కార్డులలో నికర నష్టాలు 5-6 శాతానికి దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. గడిచిన త్రైమాసికంలో ఎస్‌బిఐ కార్డు 7.5 శాతం నికర క్రెడిట్ లాస్ (ఎన్‌సిఎల్)ను చవి చూసిందని తెలిపారు.
”రుణగ్రహీత వాయిదాలలో తిరిగి చెల్లిస్తారనే ఆలోచనతో తొలుత పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేయడంతో డిఫాల్ట్ ప్రారంభమవుతుంది. కానీ ఈ బాకీపై కొన్ని సార్లు సంవత్సరానికి 48 శాతం వరకు వడ్డీనీ చెల్లించాల్సి వస్తుంది. కనీస మొత్తాన్ని చెల్లించే వరకు రుణగ్రహీత పరిస్థితి దిగజారుతుంది. ఆ తర్వాత డిఫాల్ట్ అవుతున్నారు.” అని డెట్ రిలీఫ్ వేదిక ఫ్రీడ్ సిఇఒ రితేష్ శ్రీవాస్తవా పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆగస్టులో కొత్తగా 9.2 లక్షలకు పైగా క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయని ఆర్‌బిఐ వెల్లడించింది. ఇంతక్రితం జులైలో 7.55 లక్షల కార్డులను అందించాయి. మొత్తం క్రెడిట్ కార్డుల సంఖ్య 10.55 కోట్లకు చేరాయి. ఈ కార్డుల జారీలో ప్రతీ ఏడాది సగటున 15.6 శాతం పెరుగుదల నమోదవుతోంది. గడిచిన ఆగస్టు నెలలో హెచ్‌డిఎఫ్‌సి అత్యధికంగా 2.41 లక్షల కార్డులను జారీ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ 1.45 లక్షలు, యాక్సిస్ బ్యాంక్ 1.27 లక్షలు, ఎస్‌బిఐ కార్డ్స్ 1.1 లక్షల చొప్పున కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేశాయి.
More Stories
రెండు రైతు సంక్షేమ పథకాలకు రూ.లక్ష కోట్లు
స్టాక్ మార్కెట్లలో రూ.11లక్షల కోట్ల సంపద ఆవిరి
చైనా సీసీటీవీ కెమెరాలు, ఇతర నిఘా పరికరాలపై ఆంక్షలు!