మృతుల్లో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఒక మహిళ, నెల వయసున్న చిన్నారి సైతం ఉన్నట్లు తెలిపారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ప్రజలు అంధకారంలోకి వెళ్లిపోయారు. పలు ఆసుపత్రుల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఇక యునికోయ్ కౌంటీ ఆసుపత్రిని వరదలు ముంచెత్తడంతో రంగంలోకి దిగిన అధికారులు హెలికాప్టర్ సాయంతో 54 మందిని రక్షించారు. అదేవిధంగా టెనస్సీలోని న్యూపోర్ట్ సమీపంలో 7 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్లోరిడా లోని బిగ్బెండ్ ప్రాంతంలో ఈ హెలీన్ హరికేన్ శుక్రవారం రాత్రి తీరం దాటింది.
తీరం దాటే సమయంలో గంటకు 225 కిలోమీటర్ల వేగంత గాలులు వీయడంతో బిగ్ బెండ్ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. హెలీన్ కేటగిరీ 4 హరికేన్ కాగా గతేడాది కూడా బిగ్ బెండ్ దగ్గర కేటగిరీ 3 స్టార్మ్ ఇదాలియా తీరం దాటింది. ఈ తుపాను ధాటికి సముద్రపు అలలు దాఆపు 20 అడుగుల ఎత్తుకుపైనే ఎగిసిపడుతున్నాయి. ఈ తుపాను కారణంగా ఆయా రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.

More Stories
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రక్షణ వ్యయం పెంపుపై జి7 దేశాల మధ్య విబేధాలు
ప్రజాస్వామ్యం పునరుద్ధరిస్తే స్వదేశంకు హసీనా సిద్ధం!