* యుద్ధంలో బ్రిటన్ కలిసిరాకపోవడంపై ట్రంప్ అసంతృప్తి
ప్రముఖ అణు శుద్ధి కేంద్రం నతాంజ్‌కు తాజా వైమానక దాడుల వల్ల కొంత నష్టం జరిగినట్టు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ( ఐఏఈఏ) నిర్ధారించింది. అయితే ప్రజలకు లేదా పరిసర ప్రాంతాలకు ఎలాంటి రేడియేషన్ ప్రమాదం లేదని స్పష్టం చేసింది. భూగర్భ భాగానికి వెళ్లే ప్రవేశ భవనాలు కొంత దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రధాన అణు శుద్ధి వ్యవస్థలు మాత్రం సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక చర్యల నేపథ్యంలో ఈ నష్టం సంభవించినట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ అణు పదార్థాలు బయటకు లీక్ కాలేదని, రేడియోలాజికల్ ప్రభావం ఏమీ ఉండదని ఐఏఈఏ నిపుణులు హామీ ఇచ్చారు. దీనితో అణు కేంద్రాలపై దాడులు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. పరిస్థితిని ఐఏఈఏ సమీక్షిస్తూ, తదుపరి నివేదికలను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని అధ్యక్షుడి అధికారిక నివాసంపై ఇజ్రాయెల్ దళాలు నేరుగా దాడికి దిగాయి. రాన్ అధ్యక్షుడి భవనాన్ని లక్ష్యంగా చేసుకుని శక్తివంతమైన బాంబులను జారవిడిచారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించి మరీ ఇజ్రాయెల్ దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
ఇరాన్‌పై అమెరికా జరుపుతున్న దాడుల్లో బ్రిటన్ భాగస్వామి కాకపోవడంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమ దేశంలోని ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అమెరికా తమ దాడుల కోసం బ్రిటీష్ స్థావరాలను ఉపయోగించుకోవడానికి అనుమతి కోరినట్లు స్టార్మర్ ధ్రువీకరించారు. అయితే తమ మిలటరీ బేస్‌లు కేవలం ‘రక్షణాత్మక ప్రయోజనాల’ కోసం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

More Stories
బంగ్లాదేశ్‌లో పూజలో ఉన్న హిందువులపై బాంబు దాడి
ఖమేనీ మృతికి భారీ మూల్యం చెల్లించక తప్పదు
‘ఇస్లామిక్ నాటో’కు పాక్, సౌదీ అడుగులు