అమీన్‌పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ సోమవారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అమీన్‌పూర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని ఇటీవల ఓ భవనాన్ని హైడ్రా సిబ్బంది కూల్చేశారు.
అయితే కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని చెప్పినా పట్టించుకోకుండా కూల్చేశారని బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. వచ్చే సోమవారం (సెప్టెంబర్ 30వ తేదీన) ఉదయం 10.30 గంటలకు కోర్డు ఎదుట హాజరవ్వాలంటూ రంగనాథ్‌ను ఆదేశించింది. నేరుగా లేదా ఆన్‌లైన్ విచారణకు హాజరు కావాలని హైడ్రా కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.
హైదరాబాద్‌లో ఓవైపు హైడ్రా కూల్చివేతలు జోరుగా సాగుతుండగా, మరోవైపు మూసీ పరివాహక ప్రాంతాల్లోని నివాసాలకు మార్కింగ్ జరుగుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇటీవల కూకట్ పల్లి నల్ల చెరువు ఆక్రమణలను, అమీన్ పూర్‌లో నిర్మించిన పలు విల్లాలను హైడ్రా కూల్చివేసింది.
అయితే ఈ కూల్చివేతలు సర్వత్రా వివాదాస్పదంగా మారాయి. కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలోని నిర్మాణాలు సుమారు అన్నీ స్థలాలు లీజుకు తీసుకుని అందులో చిన్న చిన్న వ్యాపారాలు నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, అమీన్ పూర్ కూల్చివేతల్లో మాత్రం దాదాపు నివాస గృహాలే ఉండటం గమనార్హం.
అందులోనూ చాలా మంది బ్యాంకుల్లో లోన్లు తీసుకుని మరీ ఇండ్లు నిర్మించుకున్నామంటూ బోరుమన్నారు.
ఒకరేమో కూల్చేందుకు వారం రోజుల ముందే గృహప్రవేశం చేశామంటూ కన్నీళ్లు పెట్టుకోగా మరొకరు మూడు రోజుల కిందే రిజిస్ట్రేషన్ చేపించుకున్నామని చెప్తూ గోడు వెళ్లబోసుకున్నారు. బ్యాంకుల్లో లక్షలు లక్షలు లోన్లు తీసుకొచ్చుకుని.. కలల సౌధం నిర్మించుకుంటే ళ్ల ముందే నేలమట్టం చేశారని గుండెలు బాదుకున్నారు.
తాము బిల్డర్ల దగ్గర కొనుక్కుని ఇండ్లు కట్టుకున్నామని తాము ఇండ్లు కట్టుకునేందుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడేమో ఇది ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయటం దారుణమని బాధపడ్డారు.
More Stories
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు
సోషల్ మీడియా పాత్రపై విద్యా భారతి సమాలోచనలు
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన