* ఆసియా హాకీ టోర్నీలో సెమీస్‌లోకి అడుగు!
పాకిస్తాన్ 8వ నిమిషంలోనే గోల్ సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అహ్మద్ నదీమ్ ఈ గోల్ సాధించాడు. తర్వాత భారత్ అటాకింగ్ గేమ్‌తో స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించింది. 13వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. దీంతో స్కోరు 1-1తో సమమైంది. ఆ తర్వాత భారత్ మరింత దూకుడుగా ఆడింది. వరుస దాడులతో పాకిస్థాన్‌ను హడలెత్తించింది.
ఇదే సమయంలో 19వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ భారత్‌కు రెండో గోల్ సాధించి పెట్టాడు. తర్వాత కూడా భారత్ ఆధిపత్యం చెలాయించింది. ప్రథమార్ధం ముగిసే సమయానికి హర్మన్ సేన 2-1 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో కూడా పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. స్కోరును సమం చేసేందుకు పాకిస్థాన్ సర్వం ఒడ్డింది. అయినా పటిష్టమైన భారత డిఫెన్స్‌ను దాటుకుని గోల్స్ సాధించలేక పోయింది.
మరోవైపు భారత్‌కు గోల్స్ సాధించే అవకాశాలు లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. కానీ, చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన భారత్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలో భారత్ అసాధారణ ఆటను కనబరిచింది.
తొలి మ్యాచ్‌లో ఆతిథ్య చైనాపై 3-0తో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో 5-1తో మలేసియాను చిత్తు చేసింది. మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో 81తో గెలిచి హ్యట్రిక్ విజయాన్ని అందుకుంది. తర్వాతి మ్యాచ్‌లో పటిష్టమైన దక్షిణ కొరియాను 3-1 తేడాతో చిత్తు చేసింది. ఇక ఆఖరి మ్యాచ్‌లో దాయాది పాక్‌ను కూడా మట్టికరిపించి లీగ్ దశలో అజేయంగా నిలిచింది.
సోమవారం సెమీ ఫైనల్ పోరు జరుగనుంది. కాగా, ఈ టోర్నీలో ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ట్రోఫీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాయి.
More Stories
కెనడాలో హిందూ దేవాలయంపై దాడి
అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది సమరం రేపే
ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ హతం