అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ముందుగా ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు నివేదికను అందజేసినట్టు తెలిసింది.
ఈ అక్రమంగా వ్యవహరించినట్టు నిర్ధారణ అయిన ఆరుగురు అధికారుల పేర్లను వెల్లడించి, వారి హోదాలు, చేసిన అతిక్రమణలు, జారీచేసిన ప త్రాల వివరాలను వివరిస్తూ నివేదికను హైడ్రా రూపొందించింది. మరికొందరు అధికారులపై నా విచారణ జరుగుతుందని, విచారణలో నియమాలను అతిక్రమించినట్టు తేలితే వారిపైనా కేసులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేషన్ లేదు. చట్టబద్ధత కూడా కల్పించాల్సి ఉంది. ఇదే విషయంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నగరంలో తన పనిని మొదలుపెట్టిన హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది. మరికొందరికి నోటీసులను కూడా జారీ చేసింది.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల జాబితాను కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం అక్రమణలకు పాల్పడిన వారు మాత్రమే కాకుండా… అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇదే విషయంపై హైకోర్టు కూడా ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు నమోదు చేయటంతో శాఖపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇక అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. హైడ్రాకు వ్యతిరేకంగా పలువురు నేతలు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలు కోర్టుకు వెళ్లడంపై ఏం చేయాలనే యోచనలో చర్చించినట్లు సమాచారం. హైడ్రాకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
More Stories
పోలీసులు క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆశా వర్కర్లు
సోషల్ మీడియా పాత్రపై విద్యా భారతి సమాలోచనలు
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన