రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గీ కోర్సకొవ్, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు పవన్ కల్యాణ్‌తో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు.
అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమని తెలిపారు. శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గి కోర్సకొవ్‌ను పవన్ కల్యాణ్ సత్కరించారు. చంద్రయాన్ -3 రాకెట్ నమూనాను బహుకరించారు. సెర్గి ఆరు నెలల పాటు అంతరిక్షంలో విహరించారు. అక్కడి విశేషాలను, అంత కాలం ఏ విధంగా ఉండగలిగారు, అక్కడ పరిశోధించిన అంశాల గురించి పవన్ కల్యాణ్ ఆసక్తిగా తెలుసుకున్నారు.
ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను రుచి చూపించారు. ఈ సమావేశంలో స్పేస్ కిడ్జ్ ఇండియా సీఓఓ వైఆర్ యజ్ఞ, సంస్ధ ప్రతినిధులు ఎస్బీ అర్జునర్, సాయి తన్య పాల్గొన్నారు.
More Stories
అమెరికాలో భారత్ వ్యతిరేక సెనేటర్ తో రాహుల్ భేటీపై బిజెపి ఆగ్రహం
పాకిస్థాన్ తో చర్చలు జరిపే కాలం ముగిసింది
కామక్రోధాలను జయిస్తేనే నిజమైన స్వాతంత్ర్యం