
నర్సాపురం-సికింద్రాబాద్ (07175) రైలు ఆగస్టు 18న (ఆదివారం) నర్సాపుర్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. అలాగే సికింద్రాబాద్-నర్సాపుర్ (07176) రైలు ఆగస్టు 19న (సోమవారం) సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు నర్సాపుర్ చేరుకోనుంది.
కాకినాడ టౌన్-సికింద్రాబాద్ (07177) రైలు ఆగస్టు 17, 19 తేదీల్లో రాత్రి 9 గంటలకు కాకినాడలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 9.05 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది. అలాగే ఈనెల 18, 20 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరనున్న సికింద్రాబాద్-కాకినాడ టౌన్ (07178) రైలు ఆగస్టు 19, 21 తేదీల్లో ఉదయాన్నే 6.30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకోనుంది.
కాచిగూడ-తిరుపతి (07455) రైలు ఆగస్టు 16న రాత్రి 10.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి ఆగస్టు 17న (శనివారం) ఉదయం 10.25 గంటలకు తిరుపతి చేరుకోనుంది. అలాగే తిరుపతి- కాచిగూడ (07456) రైలు ఆగస్టు 17న తిరుపతిలో రాత్రి 7.50 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు (ఆదివారం) ఉదయం 9.30గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
కాచిగూడ టౌన్-సికింద్రాబాద్ రైలు ఆగస్టు 18న సాయంత్రం 6.30 గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 6 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. ఇకపోతే 07188 నంబర్ కలిగిన రైలు సికింద్రాబాద్‌లో ఆగస్టు 19న రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటి రోజు (మంగళవారం) ఉదయం 8 గంటలకు కాకినాడ పట్టణానికి చేరుకుంటుంది.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి