కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశమని, కవిత బెయిల్‌కు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ త్వరలో విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆమ్‌ఆద్మీ పార్టీని బీజేపీలో విలీనం చేసుకుంటేనే డిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? అని బండి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ది కోసం గౌరవ న్యాయస్థానంపై బురద చల్లి కోర్టుల ప్రతిష్ఠను తగ్గించడం దుర్మార్గమని మండిపడ్డారు. బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్‌ది ముగిసిన అధ్యాయమని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోందని ఆయన ఆరోపించారు. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు.
More Stories
సైనిక వీరులకు వందనం చక్కటి చొరవ
ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి
శంషాబాద్ మండలంలోని ఆలయాలపై వరుసగా దాడులు