
మిడిలార్డర్‌లో జెమీమా రోడ్రిగ్స్(29) ధనాధన్ ఆడగా ఆఖర్లో రీచా ఘోష్(30) బౌండరీలతో విధ్వంసం సృష్టించింది. కవిష దిల్హరి వేసిన 19వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాది జట్టు స్కోర్ 150 దాటించింది. ఆఖరి ఓవర్లోనూ రీచా బౌండరీ కొట్టి ఔట్ కావడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 రన్స్ కొట్టింది.
టీమిండియా నిర్దేశించిన భారీ ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు ఉతికిపడేశారు. ఓపెనర్ విష్మీ గుణరత్నే(1) రనౌట్ అయ్యాక కెప్టెన్ చమరి ఆటపట్టు(61) విధ్వంసంక ఇన్నింగ్స్ ఆడింది. ఈ టోర్నీలో తొలి సెంచరీ కొట్టిన ఆమె హర్షిత సమరవిక్రమతో కలిసి భారత బౌలర్లను ఉతికేసింది. దాంతో, ఈ జోడీని విడదీసేందుకు హర్మన్‌ప్రీత్ తీవ్రంగా ప్రయత్నించింది.
అయితే అర్ధ శతకం తర్వాత దీప్తి శర్మ ఆమెను బౌల్డ్ చేసి బ్రేకిచ్చింది. కానీ, ఆ తర్వాత హర్షిత సమరవిక్రమ(69 నాటౌట్), దిల్హరా(30 నాటౌట్) లు పట్టుదలగా ఆడారు. వికెట్ల మధ్య వేగంగా పరుగెడుతూ డబుల్స్ తీస్తూ.. స్కోర్ బోర్డును ఉరికించారు. వీలుచిక్కినప్పుడు బౌండరీలతో జట్టును లక్ష్యానికి చేరువ చేశారు.
కాగా, 45 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సమరవిక్రమ ఇచ్చిన సులవైన క్యాచ్‌ను భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేలపాలు చేసింది. ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ భారత్ వైపు తిరిగేది. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన సమరవిక్రమ, దిల్హరలు బౌండరీలతో హోరెత్తించారు. పూజా వస్త్రాకర్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతిని దిల్హర స్టాండ్స్‌లోకి పంపింది. అంతే.. ఆసియా కప్ చరిత్రలో తొలి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న శ్రీలంక కల నిజమైంది.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
ముగ్గురు సీనియర్ నేతలకు బిజెపి షోకాజ్ నోటీసులు