సెస్ ద్వారా వసూలైన నిధులను సినీరంగంలో పని చేస్తున్న ఆర్టిస్టులు, సిబ్బంది సంక్షేమం కోసం వినియోగిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇందుకోసం సినిమాటోగ్రఫీ మంత్రి నేతృత్వంలో ఓ బోర్డును ఏర్పాటు చేస్తామని అంటున్నది. అయితే, ప్రతిపక్ష బీజేపీ మాత్రం కాంగ్రెస్ కుంభకోణాలు, తెలివి తక్కువగా ప్రవేశపెట్టిన గ్యారెంటీలతో ఖాళీ అయిన ఖజానాను నింపుకునేందుకే ఈ సెస్ విధిస్తున్నదని ఆరోపిస్తున్నది.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఐదు గ్యారెంటీల పేరిట కర్ణాటక కాంగ్రెస్ ప్రజలకు హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు ముంచుకురావడంతో ఈ గ్యారెంటీలను వేగంగా అమలు చేసింది. దీంతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని బీజేపీ, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి.
అందుకే, వరుసగా అన్ని ధరలను పెంచుతున్నదని పేర్కొంటున్నాయి. ఈ నెల ఆరంభంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) పాల ధరపై లీటరుకు రూ.2 పెంచింది. ఈ ఏడాదిలో పాల ధరను పెంచడం ఇది రెండోసారి. గత నెల పెట్రోల్, డీజిల్ ధరలపై సేల్స్ ట్యాక్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచింది. దీంతో లీటరు పెట్రోల్‌పై రూ.3, లీటరు డీజిల్‌పై రూ.3.02 ధర పెరిగింది.
ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల కేఎస్‌ఆర్టీసీకి రూ.295 కోట్ల నష్టం వచ్చిందని, కాబట్టి బస్సు చార్జీలను 15 – 20 శాతం పెంచాలని ప్రభుత్వానికి కేఎస్‌ఆర్టీసీ ప్రతిపాదనలు పెట్టింది. ఇలా లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి కర్ణాటక ప్రజలపై ప్రభుత్వం వరుసగా ధరల భారాన్ని మోపుతున్నది.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం