హైదరాబాద్ మహా నగరంలో డ్రగ్స్ అక్రమ దందాలో నైజీరియన్‌ల పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే ఉంటూ డ్రగ్స్ అమ్ముతున్నారు. వీసాల గడువు ముగిసిన నైజీరియన్లను తిరిగి వారి దేశాలకు పంపించాలని చూస్తున్నారు. ఇటీవల బంజారాహిల్స్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ జాన్‌పాల్ అరెస్టుతో నగరంలోని నైజీరియన్ల కదలికలపై పోలీసులు ఆరా తీయడంతో పాటు వారు ఉంటున్న ప్రాంతాలలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రహస్య విచారణ చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు ఇక నుంచి నైజీరియన్ పై కేసులు నమోదు చేయకుండా వారి దేశాలకు అప్పగించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. అలాగే విద్యార్థి వీసా ముసుగులో హైదరాబాద్‌లో తిష్టవేసి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 2500 మంది నైజీరియన్స్ ఉండగా వీరిలో 750 మందికి వీసా గడువు ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో కొకైన్, హెరాయిన్, ఎండీఎంఎ పిల్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలను తరలిస్తూ నైజీరియన్‌లు పెద్ద ఎత్తున పట్టుబడుతుతున్నారు.
నైజీరియన్లతో పాటు కొందరు ఆఫ్రికన్లు వీసా కాలం ముగిసినప్పటికి నగరంలోనే ఉంటూ గోవా, బెంగళూరు, మహారాష్ట్రల నుంచి మత్తు సరఫరా చేస్తున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ప్రమాదకర డ్రగ్స్‌ను తరలిస్తున్న నైజీరియన్ ముఠాను ముంబై నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించాలని చూస్తుండగా కుష్, ఓజీ డ్రగ్స్‌తో లాలాగూడలో ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇంతకాలం కొకైన్, చరాస్, గంజాయి, ఎండీఎంఎ తదితర డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్‌లు తాజాగా ప్రమాదకర డ్రగ్స్‌ను విక్రయిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. హైదరాబాద్ నగరంలోని కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా నైజీరియన్‌లు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో డ్రగ్స్ కేసులలో పట్టుబడిన నైజీరియన్‌లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. నైజీరియన్‌లు డ్రగ్స్‌ను చైన్‌లింక్ సిస్టమ్‌లో సరఫరా చేస్తున్నారని, ఒకరి నుంచి మరొకరు అందజేసుకుంటున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
More Stories
హోంగార్డ్ కుటుంబాల మెరుపు ధర్నా
బీఆర్ఎస్ జాతకాలు తన దగ్గర ఉన్నాయన్న ఒవైసి
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్‌ను అమలు దిశగా రేవంత్ ప్రభుత్వం