
అస్సాం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం గత 24 గంటల్లో వరదల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది వరదలు, కొండ చరియలు విరిగిపడటం, తుపానుల కారణంగా రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 52కు పెరిగింది. అదేవిధంగా, ఈ వరదలకు 3,208 గ్రామాలు వరదలకు తీవ్ర ప్రభావితమయ్యాయి. 29 జిల్లాల్లోని 21 లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారు.
గోల్‌పరా, నాగావ్, నల్బరీ, కమ్రూప్, మోరిగావ్, దిబ్రూఘఢ్, సోనిత్‌పూర్, లఖింపూర్, సౌత్ సల్మారా, ధుబ్రి, జోర్హాట్, చారైడియో, హోజై, కరీంనగర్, శివసాగర్, బొంగైగావ్, బార్‌పేట, ధేమాజీ, హైలాకండి, గోలాఘాట్, దర్రాంగ్, బిస్వనాథ్, కాచర్, కమ్రూప్ (ఎం), టిన్సుకియా, కర్బీ అంగ్లాంగ్, చిరాంగ్, కర్బీ అంగ్లాంగ్ వెస్ట్, మజులి జిల్లాలు వరదల కారణంగా తీవ్ర ప్రభావితమయ్యాయి.
ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 515 పునరావాస శిబిరాల్లో సుమారు 3.86 లక్షల మంది తలదాచుకుంటున్నారు. 11,20,165 జంతువులు కూడా వరద బారిన పడ్డాయి. కజిరంగా నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్‌లో 31 వన్య ప్రాణులు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. ఈ వరదలకు రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తమైంది.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా
2027లో చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం