
జీవితంలో రిస్క్ తీసుకోవాలని అదనపు డీ జీ పీ మహేష్ భగవత్ యువతకు పిలుపునిచ్చారు. రిస్క్ తీసుకుని ప్రయత్నిస్తే విజేతలు అవుతారని, లేదంటే అనుభవజ్ఞులు అవుతారని సూచించారు. రామకృష్ణ మఠంలో జరుగుతున్న’శౌర్య’ శిబిరాన్ని సందర్శించి ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
యూ పీ ఎస్ సీ విద్యార్థులకు ఇంటర్వ్యూ ని ఎదురుకునే విషయంలో ఫ్రీ కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. 2024 లో 1016 మంది విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వగా 216 మంది క్వాలిఫై అయ్యారని, మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన అనన్య ౩వ రాంక్ సాధించారని ఆయన తెలిపారు.
ఇంటర్వ్యూ విషయంలో కోచింగ్ కోరుకునే పేద విద్యార్థులు 9440700105 వాట్సాప్ నెంబర్ కు వివరాలు పంపాలని మహేష్ భగవత్ సూచించారు. ‘శౌర్య’ శిబిరంలోని విద్యార్థులకు ఆయన ‘టైం మానేజ్మెంట్’ ‘ స్ట్రెస్ మానేజ్మెంట్’ పై చిట్కాలు చెప్పారు.
కార్యక్రమంలో రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద ప్రసంగిస్తూ సమాజానికి టెక్నాలజీ తో పాటు శ్రేష్ఠులైన యువతి యువకుల అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. స్వామి వివేకానంద బోధనలు అనుసరిస్తూ జీవితాలను ఉద్ధరించుకోవాలని స్వామి బోధమయానంద పిలుపునిచ్చారు.
More Stories
అక్కినేని నాగేశ్వరరావుకు ప్రధాని మోదీ ఘన నివాళి
ప్రైవేటు ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చే అధికారం
హైదరాబాద్ లో పురుషాంగం పునఃసృష్టి