
మరోవైపు, ఢిల్లీ రైల్వే స్టేషన్లోకి వరద నీరు చేరడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల నీటిలో నడిచి వెళ్తున్నారు. ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లలోకి కూడా వరద నీరు చేరడం వల్ల అసౌకర్యానికి గురయ్యారు. భారీ వర్షాల కారణంగా డిల్లీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని విద్యుత్ డిస్కమ్ అధికారులు తెలిపారు.
వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలు కూలిపోయాయని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఢిల్లీలో తాజా పరిణామాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించేందుకు అత్యవసర సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశానికి ఢిల్లీ మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోవైపు, ఢిల్లీలో భారీ వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. నైరుతీ రుతపవనాలు ఢిల్లీకి చేరుకున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. తీవ్రమైన ఎండ, వడగాలులకు బ్రేక్ చెబుతూ.. వర్షాకాలం వచ్చినట్లు ఢిల్లీలోని ఐఎండీ ఆఫీసు ప్రకటించింది.
యావత్ ఢిల్లీ ప్రాంతాన్ని నైరుతీ రుతుపవనాలు చేరుకున్నట్లు ఐఎండీ తెలిపింది. జైసల్మేర్, చురు, భివాని, ఢిల్లీ, అలీఘడ్, కాన్పూర్, ఘాజిపూర్, గోండా, ఖేరి, మొరాదాబాద్, డెహ్రాడూన్, ఉనా, పఠాన్‌కోట్, జమ్మూ ప్రాంతాలకు నైరుతి చేరుకున్నట్లు ఐఎండీ వెల్లడించింది. వర్షాలతో ఢిల్లీ తల్లడిల్లడంపై బీజేపీ ఎంపీ కమల్జీ షెహ్రవత్ ఆప్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తప్పుడు ఆరోపణలు గుప్పించడంలో బిజీగా మారిన ఆప్ ప్రభుత్వమే ఈ పరిస్ధితికి కారణమని ఆరోపించారు.
మరోవైపు దేశ రాజధాని రోడ్లు జలమయం కావడంపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ స్పందిస్తూ కాలువలను శుభ్రం చేయాలని తాము గత రెండు నెలలుగా చెబుతున్నా ఢిల్లీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ నిర్వాకంతో కాలువలన్నీ మూసుకుపోయాయని, భారీ వర్షాలతో వరద ముంచెత్తిందని ఆరోపించారు. ఆప్ వైఫల్యానికి ఇది పరాకాష్టని విమర్శించారు.
More Stories
సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే కాంగ్రెస్కు అర్థం కావట్లేదు
ఛత్తీస్గడ్లో మరో నలుగురు మావోలు మృతి
అమెరికా నుంచి వచ్చిన 104 మందిలో 48 మంది 25 ఏళ్లలోపు వాళ్లే!