జగిత్యాల నియోజకవర్గంలో తన ప్రత్యర్థి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌ను తనకు తెలియకుండానే పార్టీలో చేర్చుకున్నారంటూ ఆగ్రహంతో ఊగిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చివరకు మెత్తబడిపోయారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ సంకేతాలు ఇచ్చిన జీవన్‌రెడ్డి చివరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఎమ్మెల్యే సంజయ్‌ను పార్టీలోకి చేర్చుకున్న నేపథ్యంలో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జీవన్రెడ్ అధిష్ఠానం పిలుపు మేరకు బుధవారం ఢిల్లీ వెళ్లారు. పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో భేటీ ఉంటుందని భావించిన జీవన్‌రెడ్డికి అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. బుధవారం కనీసం వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు.
దీంతో ఆయన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ, కేసీ వేణుగోపాల్‌తో మాత్రమే సమావేశమయ్యారు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన అనంతరం జీవన్‌రెడ్డి పూర్తిగా రాజీపడిపోయారు. పైగా, మంత్రి పదవి లభిస్తుందనే హామీ కూడా నెరవేరలేదు. మారుతున్న రాజకీయ పరిస్థితులతో సర్దుకుపోవడానికి సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతాయి. చేర్చుకోవడాలు ఆగవు. తర్వాత మీ ఇష్టం’ అని స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే, ఎవరినైనా పార్టీలోకి తీసుకొనేటప్పుడు స్థానిక కాంగ్రెస్ నేతలతో చర్చిస్తామని చెప్పారు. జీవన్‌రెడ్డికి ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమ్రంతి రేవంత్‌రెడ్డితో మాట్లాడుకోవాలని కేసీ వేణుగోపాల్ సూచించినట్టు తెలిసింది.
అనంతరం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. మొదటినుంచీ పార్టీలో ఉన్న నేతలకు తగిన గౌరవం ఇస్తామని, కార్యకర్తలను కాపాడుకుంటామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారని తెలిపారు. మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కొన్ని నిర్ణయాలు తప్పవని వ్యాఖ్యానించారు. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి పనిచేస్తారా? అని మీడియా ప్రతినిధులు జీవన్‌రెడ్డిని ప్రశ్నించగా, అధిష్ఠానంతో కలిసి పనిచేస్తానని చెప్పడం గమనార్హం.
More Stories
ప్రజాస్వామ్యానికి మూల స్తంభం మీడియా
మున్సిపల్ ఎన్నికల వాయిదాకు రేవంత్ ఎత్తుగడలు
రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఉందా?