వైసిపి హయాంలో నీటివరరులను నిర్లక్ష్యం చేయడం, ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయకపోవడంతో ఆయన ఈ అంశంకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. గతంలో మాదిరిగా ఇక నుండి ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పై దృష్టి సారిస్తానని సంకేతం ఇచ్చారు. వచ్చే సోమవారం పోలవరంకు తన పర్యటన ఏర్పాటు చేయమని అధికారులను కోరారు.
పోలవరం ప్రాజెక్టును సోమవారం సందర్శించి, నిర్మాణ పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తానని చంద్రబాబే స్వయంగా అధికారులకు తెలిపార అప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక నివేదిక ఇచ్చినప్పటికీ, పూర్తిస్థాయి నివేదిక మాత్రం వారం రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు మరో 14 ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను చంద్రబాబుకు అధికారులు అందించారు.
ఐదేళ్లలో జలవనరుల శాఖలో జరిగిన పనులు, చెల్లించిన నిధుల వివరాలతో వెంటనే ఒక నివేదిక తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రాజెక్టుల ప్రాధాన్యత, ప్రాంతాలు, తక్షణ అవసరాలు వంటి వివరాల ఆధారంగా ఈ నివేదిక ఉండాలని చెప్పారు. ముఖ్యంగా ఐదేళ్లలో జరిగిన చెల్లింపుల్లో ఎవరికీ ఎన్ని నిధులు ఇచ్చారు,వారు చేసిన పనులు, చేయాల్సిన పనులు అనే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
జలవనరుల శాఖలో కొద్ది మంది అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని చెబుతూ ఇక ముందు వారి ఆటలు చెల్లవని హెచ్చరించారు. అటువంటి అధికారులపై తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
More Stories
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం