ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. తాను గతంలో చాలా ఎన్నికలు చూశానని, రాష్ట్ర ,చరిత్రలో ఎప్పుడు చూడని తీర్పును ప్రజలు ఇచ్చారని, రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలకు శిరస్సు వహించి పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాష్త్ర అధ్యక్షురాలు డి పురందేశ్వరి, మూడు పార్టీల ఎమ్యెల్యేలు పాల్గొన్నారు.
ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని ప్రచారం చేశామని, ఎన్నికల్లో ప్రజలు గెలిచారని, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత గెలిచిన శాసనసభ్యులపై ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. కూటమిలు ఏర్పాటు తర్వాత ఎలాంటి ఫిర్యాదులు లేకుండా జరిగిన ఎన్నికలు ఇవేనని చంద్రబాబు చెబుతూ నూటికి నూరు శాతం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజల మనోభావానికి అనుగుణంగా మూడు పార్టీల కార్యకర్తలు పనిచేశారని చెబుతూ మూడు పార్టీల కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందించారు. 1994లో ఏకపక్ష ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు, ఓట్లు రాలేదని గుర్తు చేశారు. 175లో 164గెలిచామని, 11మాత్రమే ఓడిపోయామని, స్ట్రైకింగ్ రేట్ 93శాతం ఉందన్నారు. ఓట్లు కూడా 57శాతం వచ్చాయని, 50శాతం వస్తే చాలా ఎక్కువని భావిస్తామని, అంతకంటే రెట్టింపు వచ్చాయని చెప్పారు.
పవన్ సమయస్ఫూర్తిని ఎప్పుడు మర్చిపోలేనని చెబుతూ జైల్లో ఉన్నపుడు వచ్చి తనను పరామర్శించారని, బయటకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని అంతకు ముందు ప్రకటించినా, టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్టు జైలు బయట ప్రకటించారని గుర్తు చేశారు. బీజేపీ,జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పి ఆ ప్రయత్నాలు చిత్తశుద్ధితో చేశారని కొనియాడారు. ఆ రోజు నుంచి ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశారని తెలిపారు.
ఓటు బదిలీపై తమకు మొదట్లో అనుమానాలు ఉండేవని, కొవ్వూరులో మూడు పార్టీలు కలిసి ప్రచారం చేశామని, ఆరు జిల్లాల్లో ఇద్దరు కలిసి ప్రచారం చేశామని చెప్పారు. అనంతపురంలో అమిత్ షా ధర్మవరం ప్రచారానికి వచ్చారని చెప్పారు.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
తిరుమలలో శారదాపీఠం అక్రమ నిర్మాణంపై హైకోర్టు ఆగ్రహం