ప్రస్తుతం.. ఆర్టీఓ కార్యాలయాల్లో అధికారుల సమక్షంలో నిర్వహించే డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొని పాసైతేనే డ్రైవింగ్ టెస్ట్ వస్తుంది. అయితే అధికారులపై రోజురోజుకు పెరిగిపోతున్న ఒత్తిడిని తగ్గించాలని, లైసెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదించిన ట్రైనింగ్ సెంటర్లలోనే పరీక్ష నిర్వహిస్తారు. ఆ కేంద్రాల్లోనే లైసెన్స్ సర్టిఫికెట్లు పొందొచ్చు.
ఇక ఈ కొత్త డ్రైవింగ్ రూల్స్ ఉల్లంఘిన విషయం కాస్త కఠినంగానే ఉంది. నిబంధన ప్రకారం సరైన లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 1000 నుంచి రూ. 2000 వరకు జరిమానా పడుతుంది. ఒకవేళ మైనర్ వాహనం నడుపుతూ దొరికిపోతే సంబంధిత వ్యక్తి గార్డియన్ లేదా తల్లిదండ్రులకు రూ. 25వేల వరకు జరిమానా పడొచ్చు.
అంతేకాదు సదరు మైనర్.. 25ఏళ్లు వచ్చేంతవరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందలేరు. ఇక మైనర్ నడిపిన వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ని కూడా రద్దు చేస్తామని నిబంధనలు చెబుతున్నాయి. కాగా.. డ్రైవింగ్ లైసెన్స్‌కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్‌లో మాత్రం మారలేదు. ఆన్లైన్లో లేదా పరివాహన్ వెబ్సైట్లో అప్లికేషన్ దాఖలు చేసుకోవచ్చు.
స్థానిక ఆర్టీఓకి వెళ్లి మేన్యువల్గానూ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ దాఖలు చేసుకోవచ్చు. నూతన డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాత దానిని రెన్యువెల్ చేసుకునే ప్రాసెస్‌లో కూడా మార్పులు చేసింది కేంద్రం. పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం లేదా లర్నింగ్ లైన్స్ పొందడం లేదా రెండింటినీ రెన్యూ చేసుకోవడం కోసం ఫీజును రూ. 200గా నిర్దేశించింది. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కి మాత్రం అది రూ. 1000గా ఉంది.
కాగా, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ప్రైవేట్ డ్రైవింగ్ టెస్టింగ్ స్కూల్స్‌కి కీలక నిబంధనలు పెట్టింది కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లకు కనీసం 1 ఎకర భూమి ఉండాలి. 4 వీలర్ ట్రైనింగ్ ఉంటే 2 ఎకరాల భూమి తప్పనిసరి. అన్ని రకాల వసతులను స్కూల్ తప్పనిసరిగా కేటాయించాలి. ట్రైనర్‌కి హై స్కూల్ డిప్లొమా (లేదా అందుకు సమాన చదువు) ఉండాలి. కనీసం 5ఏళ్ల డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి. బయోమెట్రిక్స్, ఐటీ సిస్టెమ్స్పై అవగాహన ఉండాలి. లేకపోతే తీసుకోకూడదు. లైట్ మోటార్ వెహికిల్స్‌కి అయితే.. 4 వారాల్లో 29 గంటలు. 8 గంటల థియరీ, 21 గంటల ప్రాక్టికల్ ట్రైనింగ్.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి