హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్

భారత్ స్టార్ క్రికెట్ ప్లేయర్ విరాట్  కోహ్లీ హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో తన రెస్టారెంట్ బ్రాంచ్ ఓపెన్ చేశాడు. విరాట్ కోహ్లి వన్8 కమ్యూన్ పేరుతో ఇప్పటికే బెంగళూర్,ముంబై,పూణె, కోల్ కత్తా నగరాల్లో ఈ రెస్టారెంట్ లను నడుపుతున్నారు. ఈ క్రమంలోనే అయన.. హైదరాబాద్ లో కూడా వన్ 8 కమ్యూన్ బ్రాంచ్ ప్రారంభించారు.

హైటెక్ సిటీలోని హార్డ్ రాక్ కేఫ్ కు సమీపంలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని ఆర్ఎంజెడ్ థీ లాఫ్ట్ లో ఈ రెస్టారెంట్ ను కోహ్లీ శుక్రవారం ప్రారంభించారు.ఇదే విషయాన్ని విరాట్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశాడు. ” మేము ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని హైటెక్ సిటీకి వచ్చేశాం.నాకు వన్ 8 కమ్యూన్ అంటే అది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు. అది హైదరాబాద్ ప్రజలందర్నీ ఒకే చోట చేర్చి వారికి నచ్చిన ఆహారం అందించడం మా ఉద్దేశం ” అని విరాట్ కోహ్లి పేర్కొన్నారు.

 

 వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్ లో గ్లోబల్ మెనూతో పాటు 20 రకాల లోకల్ రుచులు కూడా అందుబాటులో ఉండనున్నాయి. వేడుకకు ఆర్‌సీబీ ఆట‌గాళ్లు వ‌చ్చి సందడి చేశారు.