అబద్ధాల గ్యారెంటీతో అధికారంలోకి కాంగ్రెస్

అబద్ధాల గ్యారెంటీతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని బిజెపి నేత  మాజీ ఎమ్మెల్సీఎన్  రామచంద్రరావు తెలిల్పారు. పట్టభద్రుల బీజేపీ  ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కోసం ఖమ్మం జిల్లాలో రామచంద్రరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జాతీయవాద ఎన్నిక, జాతీయవాద వ్యతిరేఖ ఎన్నిక అని చెప్పారు. 
 
అనేక ఉద్యమాలు చూసిన జిల్లా కాబట్టి ఎవరికి ఓటు వేయాలో మీకు తెలుసునని పేర్కొన్నారు.  రెండు రోజులుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ నాయకులు ఖమ్మం జిల్లాలో తిరుగుతున్నారని తెలిపారు. బీజేపీ నాయకులు హైదరాబాద్‌ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా చేసే ప్రయత్నం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 
 
బీజేపీ నాయకులకు ఓటు వేయొద్దని తామే ఉన్నత విద్యావంతులమని . మాజీ మంత్రి కేటీఆర్ చెప్పుకుంటున్నారని పేర్కొంటూ  బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసిందో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే చేస్తుందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు కూడా చట్టసభల్లో ప్రతిపక్షం ఉండకూడదని కుట్ర పన్నాయని ఆరోపించారు. 
 
ప్రేమేందర్ రెడ్డి 40 సంవత్సరాలు ఓకే సిద్ధాంతం మీద నిలబడి, ఓకే పార్టీలో ఉండి ప్రజల పక్షానా పోరాడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసునని తెలిపారు. విద్యార్థులను, రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశంలో బీజేపీ అధికారంలోకి రాకుండా చేయాలని కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ స్థాయి పెరుగుతోందని, అలా జరిగితే ప్రజల తరపున పోరాడుతుందనే భయంతో రెండు పార్టీలు కలిసి తమపై లేని పోని అబద్ధాలు చెబుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి వేసి గెలిపించాలని రామచంద్రరావు కోరారు.

.