మే 13న పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రం(202)లో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడం, పోలింగ్ ఏజెంట్ కు బెదిరింపులు, మహిళలను దుర్భాషలాడిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ అయింది.
ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఈసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వెంటనే పిన్నెల్లిని అరెస్టు చేయాలని డీజీపీని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం గాలింపు చేపట్టారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై పోలీసులు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలోని 10 సెక్షన్లు ఈ నెల 20న పిన్నెల్లిపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

More Stories
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో అప్రూవర్‌గా మారిన ధర్మారెడ్డి
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి
రూ. 750 కోట్లతో యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్