ఏప్రిల్ 26న జరిగిన కర్ణాటక లోక్‌సభ ఎన్నికల తొలి దశకు ముందు ప్రజ్వల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అతను విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ప్రజ్వల్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. అయితే, ఇప్పటి వరకూ అతడు భారత్‌కు తిరిగిరాలేదు.
ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రజ్వల్‌ను అభ్యర్థించారు. అశ్లీల వీడియోల కేసు తమ కుటుంబం మొత్తాన్ని తల దించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు తాను బేషరతుగా ప్రజలకు క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. వెంటనే భారత్‌కు తిరిగొచ్చి పోలీసుల విచారణకు సహకరించాలని కోరారు.
‘ఎక్కడున్నా భారత్‌కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు దొంగా పోలీసు ఆట ఆడుతావు ? విదేశం నుంచి వచ్చి విచారణకు సహకరించు’ అని విజ్ఞప్తి చేశారు.
రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తానని దేవేగౌడ ప్రకటించగా, తామంతా అడ్డుకున్నామని ఈ సందర్భంగా కుమారస్వామి చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజ్వల్ ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్లాడని, ఒక వారంలో వచ్చి విచారణకు హాజరవుతానని ప్రకటించిన అనంతరం అతనిపై అత్యాచారం కేసు నమోదు చేయడంతో భారత్‌కు వచ్చేందుకు వెనకడుగు వేసి ఉండొచ్చని కుమారస్వామి పేర్కొన్నారు.
More Stories
బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు
ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్‌లు గెలవాలి
‘జాతీయ ఆరోగ్య మిషన్’ మరో ఐదేళ్లు పొడిగింపు