పాకిస్థాన్ కు నేను గాజులు తొడుగుతా…. ప్రధాని మోదీ

పాకిస్థాన్ కు నేను గాజులు తొడుగుతా…. ప్రధాని మోదీ
2024 లోక్​సభ ఎన్నికల్లో ప్రచారాల జోరును పెంచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పాకిస్థాన్​పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్​గా మారాయి. బిహార్​లో జరిగిన ఓ బహిరంగ సభలో.. ‘నేను పాకిస్థాన్​కి గాజులు తొడుగుతాను,’ అని ఆయన చెప్పారు. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో పాకిస్థాన్​పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. 
 
 రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పాక్​ ఆక్రమిత కశ్మీర్​ని భారత్​లో కలుపుకుంటామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఫరూక్​ అబ్దుల్లా మండిపడ్డారు. ‘పొరుగు దేశం గాజులు వేసుకుని కూర్చోలేదు. వాళ్ల దగ్గర అణుబాంబు ఉంది. అది ఇండియాకు హాని చేయొచ్చు,’ అంటూ హెచ్చరించారు.
ఇక బిహార్​ల జరిగిన బహిరంగ సభలో ఫరూక్​ అబ్దుల్లా వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు చేస్తూ అదే సమయంలో పాకిస్థాన్​ ఆర్థిక కష్టాలను ప్రధాని లేవనెత్తారు.
“పాకిస్థాన్​ ఇంకా గాజులు వేసుకోకపోతే.. నేను గాజులు తొడుగుతాను. వాళ్ల దగ్గర విద్యుత్​ లేదు. తిండి లేదు. వాళ్లకి ఇప్పుడు గాజుల కొరత కూడా ఉందని నాకు తెలిసింది,” అని ముజాఫర్​లో జరిగిన సభలో ఎద్దేవా చేశారు.

మరోవైపు, ‘పాకిస్థాన్ దగ్గర అణుబాంబు ఉంది. మనం ఆ దేశాన్ని గౌరవించండి,’ అని కాంగ్రెస్ ​ నేత మణి శంకర్​ అయ్యర్​ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దీనిపైనా మోదీ కొన్ని రోజుల క్రితం స్పందించారు. “దేశ ప్రజలను కాంగ్రెస్​ నాశనం చేస్తోంది. లాంటి బలహీన మనస్థత్వం వల్లే సీమాంతర ఉగ్రవాదం గతంలో ఎక్కువగా ఉండేది. ఇక పాకిస్థాన్​ విషయానికొస్తే.. తాము తయారు చేసిన బాంబులను అమ్మడానికి ఆ దేశం చాలా ప్రయత్నిస్తోంది. కానీ నాణ్యత సరిగ్గా లేకపోవడంతో కొనేవారే లేరు!” అని మోదీ పేర్కొన్నారు.

విపక్ష ఇండియా కూటమిపైనా విరుచుకుపడ్డారు మోదీ. “బిహార్​ ప్రజల కన్నా.. ఆర్​జేడీ- కాంగ్రెస్​కి ఓటు బ్యాంకు సంక్షేమమే ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన కోసం ఆర్​జేడీ ప్రయత్నిస్తోంది,” ప్రధాని ఆరోపించారు.  ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న లాలూ ప్రసాద్​ యాదవ్​ మాటలను తిప్పికొడుతూ ‘దళితుల రిజర్వేషన్లను దోచుకోవడానికి ఆర్​జేడీ, కాంగ్రెస్​ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి’ అని మోదీ మండిపడ్డారు.