రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ద్వారకా శ్రీ రామ్ లీలలో జరిగిన దసరా వేడుకలకు హాజరు కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంద్రప్రస్థ రామ్ లీలా మైదానంలో జరిగిన విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఎర్రకోట సమీపంలోని రామ్ లీలా మైదాన్‌లో జరిగిన లవ్ కుష్ రామ్ లీలా వేడుకలకు హాజరయ్యారు.
ద్వారకలో జరిగిన వేడుకలకు రాష్ట్రపతి ముర్ము, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేబినెట్ మంత్రి పర్వేష్ వర్మలతో కలిసి హాజరయ్యారు. అక్కడ ఆమె రావణుడి దిష్టిబొమ్మకు దహనం చేశారు. రాష్ట్రపతి ముర్ము, రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడానికి బాణం వదిలే ముందు, శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతలకు సాంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్రపతి శ్రీరాముడి గుణాలను అలవర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రకృతిని గౌరవించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, ప్రతి ఒక్కరినీ ఆదుకోవడం వంటి వాటికి శ్రీరాముడి కథ స్ఫూర్తినిస్తుందని ఆమె చెప్పారు. ముఖ్యమంత్రి గుప్తా మాట్లాడుతూ, దసరా ఢిల్లీకి ఒక ఆనందకరమైన రోజు అని, ఇది కేవలం రావణుడిపై శ్రీరాముడి విజయానికే కాకుండా, చెడుపై మంచి సాధించిన విజయానికి కూడా ప్రతీక అని తెలిపారు. “రావణుడు సమాజంలో చీకటి, అహంకారం, కోపం, మహిళలపై హింస, అవినీతి రూపంలో ఇంకా కొనసాగుతున్నాడు,” అని ఆమె పేర్కొన్నారు.
ద్వారకా శ్రీ రామ్ లీలలో 90 అడుగుల రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను ప్రదర్శించినట్లు ఈ కార్యక్రమ కోర్ కమిటీ సభ్యుడు, మీడియా హెడ్ భరత్ భూషణ్ మాల్వీయా తెలిపారు. ఢిల్లీలోని ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని ఉత్సవ్ గ్రౌండ్లో శ్రీ రామ్‌లీలా కమిటీ ఇంద్రప్రస్థ వారు నిర్వహిస్తున్న దసరా వేడుకలలో ప్రధాని మోదీ పాల్గొంటూ జాతీయ ప్రయోజనాల కోసం పౌరులు, రాజకీయ పార్టీలు, సంస్థలు ఏకతాటిపై నిలవాలని జాతీయ ఐక్యతకు పిలుపునిచ్చారు.
దేశానికి హాని తలపెట్టేవారిని, సమాజాన్ని విభజించేవారిని, భారతీయ సంస్కృతిపై ద్వేషాన్ని వ్యాప్తి చేసేవారిని ప్రజలు గుర్తించి, వారికి వ్యతిరేకంగా నిలబడాలని ఆయన కోరారు. ఈ సంకల్పాన్ని పునరుద్ఘాటించడానికి విజయదశమి ఒక సందర్భమని ఆయన అభివర్ణించారు. తూర్పుఈ కార్యక్రమంలో సాంప్రదాయ రావణ దహన కార్యక్రమంతో పాటు, నకిలీ మందుల ఇతివృత్తంతో రూపొందించిన దిష్టిబొమ్మతో సహా అదనపు దిష్టిబొమ్మలను దహనం చేయడం కూడా ఉంది.
“దేశ గౌరవానికి హాని కలిగించే శక్తులు, సమాజాన్ని విభజించే వ్యక్తులు, మన సంస్కృతిని ద్వేషించే వారి మనస్తత్వం—వీరే దేశ శత్రువులు. ‘మా భారతి’కి శత్రువులైన వారిని గుర్తించాలి. వారిని ఓడించాలి” అని ప్రధాని స్పష్టం చేశారు.

More Stories
పెట్రోల్ ఎగుమతి సుంకం లీటరుకు రూ. 2.50కు పెంపు
శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
భారత్‌లో మిలిటెంట్లకు స్టార్‌లింక్ .. ఎలాన్ మస్క్ ఖండన