ఇక బిహార్‌ల జరిగిన బహిరంగ సభలో ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు చేస్తూ అదే సమయంలో పాకిస్థాన్ ఆర్థిక కష్టాలను ప్రధాని లేవనెత్తారు.
“పాకిస్థాన్ ఇంకా గాజులు వేసుకోకపోతే.. నేను గాజులు తొడుగుతాను. వాళ్ల దగ్గర విద్యుత్ లేదు. తిండి లేదు. వాళ్లకి ఇప్పుడు గాజుల కొరత కూడా ఉందని నాకు తెలిసింది,” అని ముజాఫర్లో జరిగిన సభలో ఎద్దేవా చేశారు.
మరోవైపు, ‘పాకిస్థాన్ దగ్గర అణుబాంబు ఉంది. మనం ఆ దేశాన్ని గౌరవించండి,’ అని కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. దీనిపైనా మోదీ కొన్ని రోజుల క్రితం స్పందించారు. “దేశ ప్రజలను కాంగ్రెస్ నాశనం చేస్తోంది. లాంటి బలహీన మనస్థత్వం వల్లే సీమాంతర ఉగ్రవాదం గతంలో ఎక్కువగా ఉండేది. ఇక పాకిస్థాన్ విషయానికొస్తే.. తాము తయారు చేసిన బాంబులను అమ్మడానికి ఆ దేశం చాలా ప్రయత్నిస్తోంది. కానీ నాణ్యత సరిగ్గా లేకపోవడంతో కొనేవారే లేరు!” అని మోదీ పేర్కొన్నారు.
విపక్ష ఇండియా కూటమిపైనా విరుచుకుపడ్డారు మోదీ. “బిహార్ ప్రజల కన్నా.. ఆర్జేడీ- కాంగ్రెస్‌కి ఓటు బ్యాంకు సంక్షేమమే ముఖ్యం. రాష్ట్రంలో అరాచక పాలన కోసం ఆర్జేడీ ప్రయత్నిస్తోంది,” ప్రధాని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న లాలూ ప్రసాద్ యాదవ్ మాటలను తిప్పికొడుతూ ‘దళితుల రిజర్వేషన్లను దోచుకోవడానికి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి’ అని మోదీ మండిపడ్డారు.

More Stories
ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకు సీబీఐ
హాంకాంగ్‌లో ఏడు భవనాలకు మంటలు.. 55 మంది మృతి
జైషే మొహమ్మద్ ఉగ్రవాదిగా మారిన డాక్టర్!