
భారత్‌లో ఇక ఏ వయస్సు వారైనా ఆరోగ్య బీమా పాలసీలు కొనుగోలు చేయవచ్చు. ఇ ప్పటి వరకు భారత్‌లో 65 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు ఆ నిబంధనను ఉపసంహరించారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు కూ డాఆరోగ్య బీమా పాలసీలుకొనుగోలు చేయవచ్చు.
ఈ మేరకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది ఈ నెల 1 నుంచి వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది. అన్ని వయస్సుల వారికి ఆరోగ్య భద్రత కల్పించడమే తమ ఉద్దేశం అని సంస్థ స్పష్టం చేసింది.
తమ తాజా నిర్ణయం ద్వారా ఇకపై బీమా కంపెనీలు వృద్ధులు, విద్యార్థులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఇలా వివిధ వర్గాల వారికి ప్రత్యేకంగా బీమా పాలసీలు రూపొందించే అవకాశం ఉంటుందని ఐ ఆర్‌డిఎఐ సూచించింది. అంతే కాదు. బీమా విధానంలో ఇటీవల తీసుకువచ్చిన మార్పులతో ఇక మీదట బీమా కంపెనీలు క్యాన్సర్, గుండె, మూత్రపిండాల వైఫల్యం, ఎయిడ్స్ వంటి ప్రమాదకర జబ్బులతో బాధ పడేవారికి బీమా పాలసీలు నిరాకరించడం కుదరదు.
ఇంతకు మునుపే ఉన్న కొన్ని వ్యాధుల విషయంలో ఆరోగ్య బీమా నిరీక్షణ వ్యవధిని 48 మాసాల నుంచి 36 మాసాలకు తగ్గిస్తున్నట్లు ఐఆర్‌డిఎఐ తన నోటిఫికేషన్‌లో తెలియజేసింది. అంతే కాదు. పాలసీ సమయంలో ఆ వ్యాధులను పాలసీదారు వెల్లడించినా, వెల్లడించకపోయినా 36 మాసాల తరువాత ఆయా క్లెయిములను తిరస్కరించడానికి ఇకపై వీలు లేదు.
ముఖ్యంగా, పాలసీదారులు ఆసుపత్రిలో చేరినప్పుడు వారికి ఆసుపత్రి ఖర్చులు భర్తీ చేసేందుకు బీమా సంస్థలు నష్టపరిహారం విధానం అనుసరిస్తుంటాయి. అయితే, ఈ నష్టపరిహారం విధానంపై కేంద్రం నిషేధం విధించింది. ఇక మీదల బీమా సంస్థలు తమ కవరేజిలో ఉన్న వ్యాధితో బాధపడే వ్యక్తికి స్థిరమైన ఖర్చులు అందించవలసి ఉంటుంది. ప్రయోజన ఆధారిత పాలసీలను మాత్రమే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావలసి ఉంటుంది.
More Stories
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు
ఎస్బీఐ నికర లాభం రూ.16,891 కోట్లు
త్వరలోనే జీఎస్టీ రేట్లు, శ్లాబ్లు తగ్గింపు