
ప్రదేశ్ లోని అమేథీ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోట వంటిది. కానీ, 2019 లోక్ సభ ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఈ సంవత్సరం ప్రారంభంలో తమ కుటుంబానికి కంచుకోటయిన రాయబరేలిని సోనియా గాంధీ వదిలిపెట్టి రాజ్యసభను ఎంచుకున్నారు.
తాజాగా, ఆ విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ 2019 లో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ అమేథీ నుంచి పారిపోయేలా చేసిందని, ఇప్పుడు కేరళ లోని వాయినాడ్ నియోజకవర్గం నుంచి కూడా పారిపోయే పరిస్థితి ఏర్పడిందని ప్రధాని మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
లోక్ సభ ఎన్నికల తొలి దశలో దేశ ప్రజలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు ఓటేశారని ప్రధాని మోదీ భరోసా వ్యక్తం చేశారు. మొదటి దశ పోలింగ్ లో ప్రజలు ఇండియా కూటమిని పూర్తిగా తిరస్కరించారని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా విపక్ష పార్టీల కోసం ఎందుకు పని చేస్తున్నారని పేర్కొంటూ మీరంతా ప్రజాస్వామ్యం కోసం కష్టపడాలని విపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలకు ప్రధాని మోదీ సూచించారు.
ఈ రోజు కాకపోతే, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజు, మీకు అవకాశం వస్తుందని వారికి హామీ ఇచ్చారు. అమేథీ, రాయబరేలీ లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడాన్ని మోదీ గుర్తు చేశారు. తమకు ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో వారి పార్టీకి అభ్యర్థి లేనందున తొలిసారిగా ఆ కుటుంబం కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయలేదని గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ప్రధాని పేర్కొన్నారు.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం
రేవంత్ కట్టడి కోసమే తెలంగాణకు మీనాక్షి నటరాజన్!