అధికారంలోకి వస్తే ఎలక్టోరల్​ బాండ్స్​ని మళ్లీ తీసుకొస్తాం

బీజేపీ అధికారంలోకి తో వస్తే ఎలక్టోరల్​ బాండ్స్​ని మళ్లీ తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. సంకేతాలిచ్చారు. “స్టేక్​హోల్డర్స్​తో ఇంకా చాలా సంప్రదింపులు, చర్చలు జరపాలి. అందరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఒక ఫ్రేమ్​వర్క్​ని ఎలా రూపొందించాలో ఆలోచించాలి. ఈ మార్గంలో వస్తున్న నల్ల ధనాన్ని అరికట్టడమే లక్ష్యం. పారదర్శకంగా ఉండేటట్లు కూడా చూసుకోవాలి,” అని హిందుస్థాన్​ టైమ్స్​తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. 

ఎలక్టోరల్ బాండ్స్ తో పాదర్శకత పెరిగిందని  నిర్మలా సీతారమన్​ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు విరాళాలు అందిచేదే ఈ ఎలక్టోరల్​ బాండ్స్​. 2018లో చట్టం రూపంలో దీనిని ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం. పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకునే వారు ఎస్​బీఐలో ఈ బాండ్స్​ని కొనుగోలు చేయాల్సి వచ్చేది. 

నిర్దేశిత సమయంలోపు వాటిని ఆయా పార్టీలు రిడీమ్​ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఈ ప్రక్రియ ద్వారా ఎవరు, ఎవరికి, ఎంత ఇస్తున్నారు? అనేది తెలుసుకోవడానికి కుదిరేది కాదు. ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎలక్టోరల్​ బాండ్స్​ అనేవి రాజ్యాంగ విరుద్ధమని తేల్చేసింది. ఈ వ్యవస్థను రద్దు చేసింది.
 
 సంబంధిత డోనర్ల వివరాలను బయటపెట్టాలని ఎస్​బీఐ, ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ  అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఇంకా సమీక్ష జరపలేదు.  ఎలక్టోరల్​ బాండ్స్​ని తొలగించడంతో పార్టీలకు నిధులు అందే విషయంలో పారదర్శకత లోపిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.  “ఎలక్టోరల్​ బాండ్స్​ స్కీమ్​లో కొన్ని మార్పులు చేయాలన్న మాట నిజమే. ఇక బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్ సరైన సంప్రదింపులు జరిపి, ఎలక్టోరల్​ బాండ్స్​ని తీసుకొచ్చే అవకాశం ఉంది,” అని ఆమె చెప్పారు.

అయితే, ఎన్నికల బండ్లపై ఇచ్చిన తీర్పును తిరిగి సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. ఎలక్టోరల్​ బాండ్స్​ని నిర్మలా సీతారామన్​ మద్దతివ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ స్కీమ్​కు సానుకూలంగా మాట్లాడారు. ఎన్నికల నిధులను పారదర్శకంగా  ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుందని గతంలో  ఆమె చెప్పారు.

ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి ఫిరాయిస్తున్న నేతలపై నేరారోపణలు ఉన్నప్పటికీ బీజేపీ పట్టించుకోలేదని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలపై ఆమె మండిపడ్డారు. “మీరు ఈరోజే నా పార్టీలోకి రండి, రేపు కేసు ముగుస్తుందని బీజేపీ ఇక్కడ కూర్చుని చెప్పదు. కేసు కోర్టుల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది, అది కాల్ తీసుకోవాల్సి ఉంటుంది; వారు కేవలం “ఓహ్, అతను మీ పార్టీకి వచ్చాడు, కేసును ముగించు” అని చెప్పరు. అలా జరగదు” అని ఆమె స్పష్టం చేశారు.

కాబట్టి ఈ వాషింగ్ మెషీన్ కోర్టుల కోసం వారు ఉపయోగించాలనుకుంటున్న పదమా? అని ఆమె ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఊపును కొనసాగించేందుకు ఆమె రోడ్ మ్యాప్‌ను కూడా రూపొందించారు. “విధాన రూపకల్పనలో స్థిరత్వం. పన్నుల ప్రక్రియ సరళీకరణ. జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ. దేశంలోకి పెట్టుబడులు రావడాన్ని సులభతరం చేయడం” గా ఆమె వివరించారు.

 ఈ విషయాలలో కేవలం కేంద్ర ప్రభుత్వం నుండి మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగు కృషి చేయాల్సి ఉంటుందని,  స్థానిక సంస్థల స్థాయిలో కూడా సరళమైన విధానాలను తీసుకు రావాల్సి ఉంటుందని ఆర్ధిక మంత్రి వివరించారు.

1960ల చివరి నుంచి ఏ జాతీయ పార్టీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉనికిని కలిగి ఉండని తమిళనాడులో తీవ్రమైన బిజెపి ప్రచారం గురించి అడిగినప్పుడు, సీతారామన్ రాష్ట్రానికి స్పష్టమైన వ్యత్యాసం ఉందని చెప్పారు. అసెంబ్లీకి స్థానిక ప్రాంతీయ పార్టీలు,  పార్లమెంటుకు జాతీయ పార్టీ ముందుంటాయని చెప్పారు. అయితే అక్కడ  కాంగ్రెస్ ద్రావిడ పార్టీలకు వదిలేసి తప్పుకుందని ఆమె చెప్పారు. 

“ఢిల్లీ నుండి జరిగే ప్రతిదీ, తమిళనాడుకు ప్రయోజనం కలిగిస్తుంది.  తమిళనాడు అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ, ఇప్పటివరకు  ఆ రాష్ట్రంలో  ఈ విషయమై తగు అవగాహన కల్పించే ప్రయత్నం చేయకుండా వారు దానిని ప్రాంతీయ పార్టీకి వదిలివేశారు” అంటూ ఆమె వివరించారు.