మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్యకు వైఎస్సార్‌సీపీ నేతలే కారణమని ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైసీపీపై మాటల దాడి పెంచేందుకు విపక్ష పార్టీల నేతలు వివేకా హత్య కేసును ప్రస్తావిస్తున్నారు.
ఈ క్రమంలో వివేకానందరెడ్డి హత్యకేసుపై కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దని కడప కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు వైఎస్ షర్మిల, డా. సునీత, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లకు ఆదేశాలను జారీ చేసింది. లోకేష్, పురందేశ్వరి కూడా వివేకా హత్యపై ప్రస్తావించొద్దని ఆదేశించింది.
ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ కడప ఎంపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డిపై పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారంటూ కడపకు చెందిన వైసీపీ నేత సురేష్ బాబు కోర్టులో పిటిషన్ వేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య విషయంపై ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రసంగాల్లో మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో సురేష్ బాబు కోర్టును కోరారు.
ప్రతివాదులుగా షర్మిల, సునీత,చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్ లతో పాటు రవీంద్ర నాథ్ రెడ్డి పేరును చేర్చారు. వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇందులో ప్రస్తావించారు. దీనిపై విచారించిన కడప కోర్టు వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
More Stories
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి
ఏపీలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులు