ఇజ్రాయిల్ లో భారతీయుల కోసం హెల్ప్ లైన్ నంబర్లు

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్దం చెలరేగడంతో ఇజ్రాయెల్‌లోని భారతీయుల కోసం భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందులోభాగంగా అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లను ఆదివారం విడుదల చేసింది. అత్యవసరమైతే.. సహాయం కోసం భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు బారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా సూచించింది.

అందులో ఫోన్ నెంబర్ల‌తోపాటు ఈ మెయిల్ అడ్రస్‌ను పొందుపరిచి పోస్ట్ చేసింది. 24 గంటలు, వారం రోజుల పాటు ఈ అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు పని చేస్తాయని వెల్లడించింది. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చిన వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది.

అలాగే భారతీయులు తనకు సంబంధించిన పూర్తి వివరాలను సదరు కార్యాలయంలో నమోదు చేసుకోవాలని విజ్జప్తి చేసింది. ఇజ్రాయెల్‌లోని పరిస్థితులను భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని స్పష్టం చేసింది. అలాగే ఆ దేశంలో భారతీయులు సురక్షితంగా ఉంచేందుకు అత్యవసరమైతే ఆ దేశ ఉన్నతాధికారులతో చర్చిస్తోందని తెలిపింది.

మరోవైపు ఇజ్రాయెల్‌లో స్థానిక ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటించాలని భారతీయులకు సూచించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు సురక్షితంగా ఉంచే క్రమంలో ఆ దేశ ఉన్నతాధికారులతో రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు సంప్రదిస్తుందని తెలిపింది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ, టెలిఅవివ్ మధ్య ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. టెలిఅవివ్‌లో విమానాలు సురక్షితంగా దిగుతాయని ఆ దేశం ప్రకటించే వరకు ఈ సర్వీసులు నిలిపివేయబడతాయని స్పష్టం చేసింది.

ఫోన్ నెంబర్లు: 1) 972 – 547520711, 2) 972 -543278392

ఈ మెయిల్ చిరునామా:  1.telaviv@mea.gov.in

బారత జాతీయులు ఈ కింద లింక్ ద్వారా రాయబార కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది:

https://forms.gle/ftp3DEXgJwH8XVRdA