
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గతంలో పలు హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పిగా, పైర్ సర్వీసెస్ డిజిగా సేవలందించారు. హైదరాబాద్ రీజియన్ ఐజిగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండిగా వివిధ హోదాల్లో పని చేశారు.
రాజీవ్ రతన్ 1991 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్. గత ఏడాది మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన సమయంలో కొత్త పోలీస్ బాస్ రేసులో రాజీవ్ రతన్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు ఐపీఎస్ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.
రాజీవ్ రతన్ హఠాన్మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థవంతంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని తెలిపారు.
More Stories
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం