‘‘సీబీఎస్ఈ” 3, 6 తరగతుల కోసం ఎన్సిఎఫ్-ఎస్ఇ 2023కు అనుగుణంగా రూపొందించిన కొత్త పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. 2024 ఏప్రిల్ రెండో వారం నాటికి 3 వ తరగతి పుస్తకాలు, 2024 మే మధ్య నాటికి 6 వ తరగతి పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి’’ అని వివరించింది. దేశవ్యాప్తంగా 1, 2, 7, 8, 10, 12 తరగతుల పాఠ్యపుస్తకాలకు సంబంధించి 2023-2024 ఎడిషన్లలో 1.21 కోట్ల కాపీలు విడుదలయ్యాయని ఎన్సీఈఆర్టీ తెలిపింది.
ఈ తరగతులకు అవసరమైన అదనపు పుస్తకాలను క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. 4, 5, 9, 11 తరగతులకు సంబంధించి 27.58 లక్షల పుస్తకాలను విడుదల చేసినట్లు ఎన్సీఈఆర్టీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ తరగతులకు సంబంధించిన 1.03 కోట్ల కాపీలు 2024 మే 31 నాటికి అందుబాటులో ఉంటాయని తెలిపింది.
అన్ని ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల డిజిటల్ కాపీలు ఎన్సీఈఆర్టీ పోర్టల్, పీఎం ఈ విద్య, దీక్ష, ఈ పాఠశాల పోర్టల్, నేషనల్ డిజిటల్ లైబ్రరీలో ఉచితంగా లభిస్తాయి. డిజిటల్ కాపీలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్సీఈఆర్టీ తెలిపింది.
3, 6 తరగతులకు సంబంధించి కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలో విడుదల చేస్తామని సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న అన్ని విద్యా సంస్థల అధిపతులకు మార్చిలో ఎన్సీఈఆర్టీ తెలియజేసింది. 2023 వరకు ఎన్సీఈఆర్టీ ప్రచురించిన పాఠ్యపుస్తకాల స్థానంలో 3, 6 తరగతులకు ఈ కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలను అనుసరించాలని పాఠశాలలకు సూచించింది.
నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలులో భాగంగా పాఠశాల విద్య కోసం కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ ( ఎన్సిఎఫ్-ఎస్ఇ 2023) 2023 కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ కొత్త సిలబస్ తో పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తోందన్న విషయం తెలిసిందే.

More Stories
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు
సంతాప తీర్మానంలో విమర్శలపై బిజెపి అభ్యంతరం