”అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నికల బాండ్లకు సంబంధించిన చర్చలో నేను పాల్గొన్నాను. వనరులు లేకుండా ఏపార్టీ కూడా మనుగడ సాగించలేదు. కొన్ని దేశాల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలే నిధులు ఇస్తాయి. భారత్ లో అలాంటి విధానం లేదు. అందువల్ల రాజకీయ పార్టీలకు ఆర్థిక వనరుల కోసం ఈ పధకాన్ని తెచ్చాం” అని గడ్కరి తెలిపారు.
రాజకీయ పార్టీలకు నేరుగా నిధులు అందాలన్నదే ఎన్నికల బాండ్ల ప్రధాన ఉద్దేశమని, అధికార మార్పిడి జరిగితే సమస్యలు తలెత్తకుండా ఉండేందుతే విరాళాలు ఇచ్చిన వారి పేర్లు వెల్లడించడం లేదని గడ్కరీ చెప్పారు. ఏదైనా మీడియా హౌస్ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే అందుకు స్పాన్సరర్ అవసరమవుతారని, అలాగే రాజకీయ పార్టీలు కూడా తమ కార్యకలాపాలు కొనసాగించాలంటే నిధులు అవసరమవుతాయని ఆయన పోలిక తెచ్చారు.
నిధులు లేకుండా పార్టీలు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాయనే వాస్తవ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరారు. అందుకోసమే పారదర్శకమైన ఎన్నికల బాండ్లను స్కీమ్ తెచ్చామని పేర్కొన్నారు. వీటిని తెచ్చినప్పుడు తమ ఉద్దేశం మంచిదేనని వివరించారు. సుప్రీంకోర్టుకు ఏదైనా లోటుపాట్లు కనిపిస్తే వాటిని సవరించమని తమను కోరవచ్చని, దానిపై అన్ని పార్టీలతో కలిసికట్టుగా చర్చిస్తామని గడ్కరి చెప్పారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం
సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన బంగ్లాదేశ్ వాసి అరెస్ట్!