బీజేపీ-జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు

కర్ణాటకలో పొత్తులతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ, జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) మధ్య సీట్ల పంపకాలు ఖరారు అయ్యాయి. ఈ విషయాన్ని కర్ణాటక బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి రాధా మోహన్ దాస్ అగర్వాల్  ప్రకటించారు. మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో జేడీఎస్ మద్దతుతో పోటీ చేయనుండగా, జేడీఎస్ 3 సీట్లలో బీజేపీ మద్దతుతో పోటీ చేయనుంది. 

కర్ణాటలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రెండో దశలో భాగంగా ఏప్రిల్ 26న, మూడో దశలో భాగంగా మే7న జరుగనున్నాయి.  లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో కర్ణాటకలోని 14 సీట్లకు పోలిగ్ జరుగుతుంది. వాటిలో బెంగళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, బెంగళూరు రూరల్, బెంగళూరు సౌత్, చామరాజనగర్, చిక్‌బల్లాపూర్, చిత్రదుర్గ, దక్షిణ కన్నడ, హస్సన్, కోలార్, మాండ్య, మైసూరు, తుంకూరు, ఉడిపి చిక్‌మగళూరు ఉన్నాయి. 
 
మూడో దశలో తక్కిన 14 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. వాటిలో చిక్కోడి, బెల్గాం, బాగల్‌కోట్, బిజాపూర్, గుల్బర్గా, రాయచూర్, బీదర్, కొప్పల్, బళ్లారీ, హవేరి, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దేవనాగెరె, షిమోగా ఉన్నాయి.