ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్

ఢిల్లీ మ‌ద్యం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి తొమ్మిది గంట‌ల ప్రాంతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ తొమ్మిదిసార్లు కేజ్రీవాల్‌కు ఈడీ అధికారులు స‌మ‌న్లు జారీ చేసినా ఆయ‌న హాజ‌రు కాలేదు.

 ఈ కేసులో ఇప్పటి వరకూ ఆప్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, తదితరులను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయకుండా నివారించాలని సుప్రీంకోర్టులో ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఎదురుదెబ్బ తగిలింది.

దాదాపు రెండు గంటలపాటు సోదాలు చేపట్టిన ఈడీ అధికారుల బృందం ఆయనను అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయానికి తరలించింది. మరోవైపు కేజ్రీవాల్ నివాసంతో పాటు ఢిల్లీలో ఆప్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కేంద్రానికి, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఇంటి పరిసరాల్లో 144 సెక్షన్‌ విధించారు.

సీఎం పదవిలో ఉంటూ అరస్టైన మొదటి వ్యక్తి అరవింద్‌ కేజ్రీవాల్‌. గ తంలో బిహార్‌ సీఎంగా ఉన్నప్పుడు లాలూప్రసాద్‌పై అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రిదేవికి బా ధ్యతలు అప్పగించారు. ఇటీవల అరస్టైన హేమంత్‌ సోరెన్‌ కూడా అరెస్టుకు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సీఎంగా ఉన్నప్పు డే జయలలితకు శిక్ష పడింది. దీంతో ఆమె సీఎం పదవిని కోల్పోయారు.

ఈ కేసులో  కేజ్రీవాల్ కు ఇప్పటికే 9 సార్లు సమన్లు జారీ అయ్యాయి. కానీ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఈడీ తనను బలవంతంగా అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర ర క్షణ కల్పించాలని కోరుతూ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను గురువారం ఉదయం విచారించిన హైకో ర్టు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను చూపించాలని ఈడీని ఆదేశించింది. 

మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణను వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు కొ న్ని పత్రాలు ఉన్న సీల్డ్‌ కవర్‌ను ఈడీ అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. దీం తో ఈ కేసులో అరెస్ట్‌ నుంచి కేజ్రీవాల్‌కు రక్ష ణ కల్పించలేమంటూ ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ ఇంటికి చేరుకొని సోదాలు నిర్వహించారు. 

కేజ్రీవాల్‌తో సహా ఆయన కుటుంబసభ్యుల ఫోన్లలోని డాటాను ల్యాప్‌టాప్‌లోకి బదిలీ చేసి వాటిని సీజ్‌ చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారన్న వార్తలు వ్యాపించా యి. దీంతో కేజ్రీవాల్‌ న్యాయవాదుల బృం దం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరుపాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరింది. 

ఇంతలోనే ఈడీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకొన్నారు. కేజ్రీవాల్‌ను పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో శుక్రవారం ప్రవేశపెట్టనున్నట్టు ఈడీ అధికారి తెలిపారు. విచారణ కోసం కస్టడీ కోరనున్నట్టు పేర్కొన్నారు. అందించింది. 2021లో తీసుకొచ్చిన ఢిల్లీ నూతన మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను పలుమార్లు విచారించిన సీ బీఐ 2023, ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకూ 390 రోజులపాటు ఆయన జైలు జీవితాన్నే గడుపుతున్నారు. 

ఇదే కేసులో ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్‌ ను కూడా గత అక్టోబర్‌లో ఈడీ కస్టడీలోకి తీసుకొన్నది. గత శుక్రవారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశా రు. ఇక ఇదే కేసు విషయమై గత ఏడా ది నవంబర్‌ 2న తొలిసారి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. 

2023 డి సెంబర్‌ 21న రెండోసారి, ఈ ఏడాది జనవరి 3న మూడోసారి, అదే నెల 18 న నాలుగోసారి, ఫిబ్రవరి 2న ఐదోసా రి, అదే నెల 19, 26న వరుసగా ఆరోసారి, ఏడోసారి, మార్చి 4న ఎనిమిదోసారి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇచ్చిం ది. చివరగా గురువారం తొమ్మిదోసారి నోటీసులు జారీ చేసింది. అయితే, విచారణకు కేజ్రీవాల్‌ హాజరుకాలేదు.