
ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిలో భారత్ 134వ స్థానంలో నిలిచింది. 2022 ఏడాదికి గాను గురువారం పలు దేశాల ర్యాంకులను ఐరాసా విడుదల చేసింది. ఇందులో భారత్ విలువ 0.633 నుంచి 0.644కి పెరిగిందని తెలిపింది. దీంతో 194 దేశాల జాబితాలో భారత్ 134వ స్థానంలో నిలిచింది.
భారత్ ఒక ర్యాంకు మెరుగుపర్చుకుంది. మానవాభివృద్ధిలో భారత్ కొన్నేళ్లుగా పురోగతిని కనబరుస్తోంది. సగటు మనిషి ఆయుర్దాయం 67.2 ఏళ్ల నుంచి 67.7కి పెరిగింది. స్థూల జాతీయ ఆదాయం 6,542 డాలర్ల నుంచి 6,951 డాలర్లకు పెరిగింది. లింగ అసమానతలు తగ్గాయి. లింగ అసమానత సూచీ (జీఐఐ) విషయానికొస్తే 2022లో 193 దేశాలలో 108వ ర్యాంకు పొందగా, 2021లో 191 దేశాలలో 122వ ర్యాంకు సాధించింది.
ఇతర దక్షిణాసియా దేశాల కంటే 0.437 సగటుతో ప్రపంచంలో 108వ స్థానంలో ఉంది. ఉద్యోగాల విషయంలో ఇది ఇంకా కొనసాగుతోంది. మధ్యస్థాయి హెచ్‌డీఐ ప్రమాణాలు కలిగిన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆరోగ్య సంరక్షణ మెరుగైంది. చిన్న వయసులో గర్భం దాల్చే వారి సంఖ్య తగ్గింది.
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దేశ నిబ్ధతకు ఇది నిదర్శనం. భారత్‌లో అభివృద్ధికి మరింత అవకాశం ఉంది. మహిళాభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా సామాజిక ఆర్థికాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చని భారత్‌లో యూఎన్‌డీపీ ప్రతినిధి కైట్లిన్ వైసెన్ తెలిపారు.
More Stories
కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా