సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఉపాసన భేటీ

మెగాస్టార్ చిరంజీవి కోడలు, గ్లోబల్ స్టార్ రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. అపోలో ఆస్పత్రి సేవలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్మాత్మిక కేంద్రం అయోధ్యలో అందించాలని ఈ నిర్ణయించారు. 
 
ఈ క్రయంలోనే సీఎం యోగితో ఉపాసన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు అయోధ్యలో ఏర్పాటు చేసిన అపోలో ఆస్పత్రి సేవల గురించి వివరించినట్లు తెలిసింది. ఆ తర్వాత తన తాత ప్రతాప్ సీ రెడ్డి లెగసీని వివరించే ది అపోలో స్టోరీ అనే బుక్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అందజేశారు ఉపాసన. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైలర్ అయ్యాయి.

 
కాగా, రానా దగ్గుబాటి సాయంతో ఉపాసన ఈ బుక్‌ని పూర్తి చేయించారు. ఈ పుస్తకంలో ప్రతాప్ రెడ్డి లెగసీ గురించి, అపోలో హాస్పిటల్స్ చరిత్ర, అవి ఎదిగిన విధానం, ఎదుర్కున్న సవాళ్లకు సంబంధించిన అంశాలను తెలియజేశారు. ఇక భవిషత్తులో కుదిరితే ప్రతాప్ రెడ్డి లైఫ్ స్టోరీని బయోపిక్ గా కూడా తీసుకు రావొచ్చని ఉపాసన వెల్లడించారు.

అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని ఉపాసన సందర్శించారు. ఈ సందర్భంగా బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో 48 రోజుల పాటు నిర్వహించిన రామరాగ్‌ సేవ  మార్చి 10తో ముగిసింది. ఈ కార్యక్రమం ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఉపాసన ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య వెళ్లారు. 
 
తాత, నాయినమ్మ, తల్లి సహా ఇతర కుటుంబసభ్యులతో కలిసి బాల రాముడిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకున్నారు. రామ మందిరాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.