ఈ లైట్ అండ్ సౌండ్ షోలో.. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ‘కోహినూర్’ వజ్రం గురించిన కథ కూడా ఉంటుంది. తెలంగాణ భూముల్లోనే కోహినూర్ వజ్రం లభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి మొదలైన కోహినూర్ కథ భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి చేసి ప్రయాణాన్ని వాటర్ స్క్రీన్ పై రంగుల రంగుల లేజర్ వెలుతురులో వివరించనున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్ అక్కడి చారిత్రక ప్రాధాన్యతను వివరిస్తూ సౌండ్ అండ్ లైట్ షోస్ ఉన్నాయి. కానీ ఓ చెరువు అలలపై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. కోహినూర్ కథతోపాటుగా తెలంగాణ కథ, ఇక్కడి సంస్కృతి, దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఈ షోను డిజైన్ చేశారు. ఈ షో పర్యాటకులను అమితంగా ఆకట్టుకోనుంది.
దీంతోపాటుగా ఈ లేజర్ షోకు వచ్చే పర్యాటకులకు సరైన సైనేజెస్ (సూచికలు), 800 నుంచి 1000 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లున్నాయి. ఇందుకోసం అన్ని వసతులతో కూడిన గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీన్ని కూడా కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.
ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలు
రొబోటిక్ నాజిల్స్ అండ్ లైటింగ్: వెయ్యికి పైగా రొబోటిక్ నాజిల్స్, డిఎంఎక్స్ ప్రొటోకాల్ తో కూడిన అడ్వాన్స్డ్ అండర్ వాటర్ లైటింగ్ సిస్టమ్స్ ద్వారా అద్భుతమైన రంగు రంగుల లైట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
లేజర్ టెక్నాలజీ: ఆకర్షణీయమైన లేజర్ రంగుల కోసం మూడు 40డబ్ల్యు ఆర్ జి బి లేజర్స్ ను ఏర్పాటు చేశారు.
హెచ్ డి ప్రొజెక్షన్: ఒక్కొక్కటి 34వేల ల్యుమెన్స్ సామర్థ్యం గల 3 HD ప్రొజెక్టర్స్ ద్వారా.. వాటర్ స్క్రీన్ పై స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రొజెక్షన్ ఉండేలా ఏర్పాట్లున్నాయి. బీమ్ మూవింగ్ హెడ్లైట్స్ ద్వారా.. విజువల్ ఎఫెక్ట్ అందంగా ఉండనుంది.
కథాపరమైన వర్ణణ: కోహినూర్ వజ్రానికి సంబంధించన కథ, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు, దేశ స్వాతంత్ర్య సంగ్రామం వంటి ఘట్టాలను సాగర్ అలలపై అందమైన లైటింగ్ ప్రొజెక్షన్ ద్వారా.. పర్యాటకులను ఆకట్టుకునేలా వివరిస్తారు. దీనికితోడు 5.1 డాల్బీ స్టయిల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ద్వారా ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్పష్టంగా ఉండబోతోంది.
రికార్డ్-బ్రేకింగ్ వాటర్ ఫౌంటేన్: 260 అడుగుల ఎత్తు, 540×130 డైమెన్షన్ తో దేశంలోనే.. అతిపెద్ద, అతి ఎత్తయిన వాటర్ ఫౌంటేన్.. ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్నాయి.
చారిత్రక ప్రాధాన్యత: స్టోరీ టెల్లింగ్ (కథను వివరించే విషయంలో) విషయంలో, చారిత్రక ఘట్టాలకు సరైన ప్రాధాన్యత విషయంలో.. సాంకేతిక సృజనాత్మకత కు పెద్దపీట వేశారు.
More Stories
ఢిల్లీ పోలీసులను 4 వారల గడువు కోరిన రేవంత్ రెడ్డి
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు