ఉక్రెయిన్, గాజా వంటి ఘర్షణలు ప్రపంచాన్ని కుదిపేసినా భారత్ వేగంగా ఎదుగుతున్నదని గోయల్ వివరించారు. తమ ప్రభుత్వ హయంలో పెద్ద సంఖ్యలో పేదలకు ఆహార ధాన్యాల పంపిణీతో పాటు ఆరోగ్య సంరక్షణ, కుకింగ్ గ్యాస్ సరఫరా సహా ఎన్నో పధకాలు పేదలకు లబ్ధి చేకూర్చాయని పేర్కొన్నారు. విపక్షాలు భారత వృద్ధి రేటుపై చేస్తున్న ప్రచారం సరైంది కాదని తోసిపుచ్చారు.
క్షేత్రస్ధాయిలో పధకాల అమలును పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుందని స్పష్టం చేశారు. భారత్ పెద్దమొత్తంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని ఆకర్షిస్తూ పలు దేశాలకు విశ్వసనీయ భాగస్వామిగా మారిందని చెప్పారు. రాబోయే దశాబ్ధంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టెక్నాలజీలు, పెట్టుబడులు దేశంలోకి వస్తాయని వీటి ద్వారా దేశ యువతకు ఉపాధి అవకాశలు పెరగడంతో పాటు మన ఆర్ధిక కార్యకలాపాలు విస్తృతం అవుతాయని వివరించారు.

More Stories
26 నుంచి రైల్వే చార్జీలు పెరుగుదల
విలువ సృష్టించే దశకుమారుతున్న తయారీరంగం
రూ. 4వేల కోట్ల బకాయిలతో కర్ణాటక ఆర్టీసీ దివాలా!