నిలిచిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా సేవలు

నిలిచిన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా సేవలు
సోషల్‌ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి మెటా ప్లాట్‌ఫామ్‌లు మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మొండికేశాయి. భారత్‌తో సహా పలుదేశాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది. సాంకేతిక సమస్య వల్ల వీటి సేవల్లో అంతరాయం ఏర్పడింది. నిరంతరం సోషల్‌మీడియాపై ఆధారపడిన నెటిజన్లు ఈ పరిణామంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. 
 
తమ అకౌంట్లు అనూహ్యంగా లాగ్‌ అవుట్‌ అయిపోవటం, తిరిగి లాగ్‌ ఇన్‌ అవుదామంటే కాకపోవటం జరగటంతో వారంతా అసహనానికి గురైనట్టు ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్‌ తెలిపింది. వెంటనే స్పందించిన మెటా సంస్థ, సమస్యను పరిష్కారం చేసినట్టు తెలిపింది. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన ఈరోజుల్లో ఇవి పనిచేయకపోతే అసలు ఏమీ తోచదు. 
 
మంగళవారం మెటా యాజమాన్యం లోని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా వాడుతున్న వినియోగదారులకు కొన్ని గంటల పాటు సేవలు స్తంభించాయి. యాప్ ఇన్‌స్టాగ్రామ్ సేవలు అమెరికా సహా పలు దేశాల్లో కొన్ని గంటల పాటు నిలిచిపోయా యి. పీక్‌దశలో 1,80,000 మంది యూజర్లకు ఇన్‌స్టాగ్రామ్ పనిచేయలేదని, జౌటేజ్ ట్రాకిం గ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్. కామ్ వెల్లడించింది.
 
డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం ఒక్క ఫేస్‌బుక్‌పైనే 3 లక్షల వరకు ఫిర్యాదులు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌ అంతరాయంపై 20 వేల మంది ఫిర్యాదు చేశారు. ఇక మెటాకు చెందిన అన్ని యాప్‌లలోని వినియోగదారులు తమ పాస్‌వర్డ్‌లను రీసెట్‌ చేసుకోలేక ఇబ్బందులు పడ్డారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లు ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోవటం ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఇంటర్నెట్‌ అంతరాయంగా పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
 
అనేక గంటలపాటు ప్రయత్నించిన తరువాత యాప్ సేవలను మెటా ఆధారిత ఇన్‌స్టాగ్రామ్ పునరుద్ధరించింది. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5.45 గంటల కు ఇన్‌స్టాగ్రామ్ ఔటేజ్ మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్ ను ట్విటర్‌లో ట్యాగ్ చేస్తూ యాప్ పనిచేయడం లేదని వినియోగదారులు ఫిర్యాదులు గుప్పించా రు. ఇన్‌స్టాగ్రామ్ బృందం తీవ్రంగా శ్రమించి గం టల వ్యవధిలో పునరుద్ధరించగలిగారు.